పెరుగుతున్న కరోనా, లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తున్న మరికొన్ని రాష్ట్రాలు!

చైనా లో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న సంగతి తెలిసిందే.భారత్ లో కూడా ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది.

ఈ నేపథ్యంలో దేశంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను కూడా అమలుచేయడం తో కొంతవరకు పరిస్థితులు చక్కబడినట్లే అనిపించాయి.అయితే నిదానంగా లాక్ డౌన్ లో సడలింపులు తీసుకురావడం తో నిదానంగా ఈ మహమ్మారి కూడా ప్రబలుతోంది.

States Again To Impose Lockdown, Lockdown, Corona Cases, Lockdown Eases, India-�

లాక్ డౌన్ సడలింపులు విధించిన తరువాతే దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతుండడం తో కొన్ని రాష్ట్రాలు మరోసారి సడలింపులతో కూడిన లాక్ డౌన్ ను విధించాయి.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు జులై 31 వరకు కూడా ఈ లాక్ డౌన్ ను కొనసాగిస్తుండగా,తాజా గా మరి కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

బెంగుళూరు,పూణే నగరాలు కూడా ఇప్పటికే లాక్ డౌన్ ను ప్రకటించాయి కూడా.బెంగుళూరు నగరంలో తీవ్రంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కర్ణాటక లో చోటుచేసుకున్న కరోనా కేసుల సంఖ్య 2 వేల కు పైగా ఉండడం గమనార్హం.దీనితో కేసుల సంఖ్య తీవ్రత ఎక్కువగా ఉండడం తో ఆ రాష్ట్ర సీఎం ఈ నెల 14 నుంచి 21 వ తేదీ వరకు కూడా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను అమలుపరచడానికి సిద్దమయ్యింది.

అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.రాష్ట్రంలో వారాంతరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది.

ఈ శనివారం నుంచి ఈ తరహా లాక్‌డౌన్ అమల్లోకి రానుండగా,ఈ లాక్‌డౌన్‌ జులై చివరి వరకు కొనసాగనున్నట్లు తెలుస్తుంది.ప్రత్యేకంగా జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్లు తెలుస్తుంది.

ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి శని, ఆదివారాల్లో మార్కెట్లు, వ్యాపారాలు అన్నీ కూడా మూసే ఉంచనున్నట్లు తెలుస్తుంది.

స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!
Advertisement

తాజా వార్తలు