Star Heroes : అభిమానులు గుండె కోస్తు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్న స్టార్ హీరోల మరణాలు

తమ అభిమాన హీరో మరణం ఎంతటి బాధను మిగిలుస్తుందో, ఆవేదన తాలూకా జ్ఞాపకాలు ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుంది చెప్పడం సాధ్యం కాదు.

ఇటీవల కాలంలో కొంత మంది స్టార్ హీరోలు అకాల మరణం చెందడం వారి అభిమానులను ఎంతగానో ఆవేదనకు గురి చేస్తుండగా, వారి భార్యలను చూస్తే కూడా ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

సదరు హీరోల భార్యలు తమ భర్తలను కోల్పోయిన బాధను దిగమింగుతూ అభిమానులు ఏదైనా వేడుకకు పిలిస్తే హాజరవుతూ తమ జీవితాన్ని ఒంటరిగానే ముందుకు తీసుకెళ్తున్నారు.హీరోలు ఎవరు వారి భార్యలు పడుతున్న వేదన ఏంటో ఒకసారి చూద్దాం.

చిరంజీవి సర్జాచిరంజీవి సర్జా( Chiranjeevi Sarja ) యాక్షన్ హీరో అర్జున్ కి స్వయానా మేనల్లుడు.తనతో పాటే నటించిన మేఘన అనే హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

మేఘన గర్భవతిగా ఉన్న సమయంలో చిరంజీవి గుండెపోటుతో కన్నుమూయగా ఆమె ఒక కొడుకుకి జన్మనిచ్చింది.పదేపదే చిరంజీవికి సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆమె ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తుంది.తారక రత్న

Advertisement

తారక రత్న( Taraka Ratna ) కుటుంబ సభ్యులను ఎదిరించి మరి అలేఖ్య రెడ్డి ( Alekhya Reddy )ని ప్రేమ వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు సంతానం అయితే తారకరత్న సైతం గుండెపోటుతో తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు.అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో అనేకసార్లు తారకరత్నను గుర్తు చేసుకుంటూ తన బాధను వెల్లడిస్తోంది.పునీత్ రాజ్ కుమార్

కన్నడ నాట పునీత్ రాజ్ కుమార్( Puneeth Rajkumar ) ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో.అతి చిన్న వయసులో జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ గుండెపోటుకు గురై కన్నుమూశాడు ఆయన ఆకాల మరణంతో కన్నడనాట రాజ్ కుమార్ కుటుంబ అభిమానులు అంతా కూడా శోకసంద్రంలో మునిగారు పునీత్ భార్య అశ్విని( Ashwini ) ప్రస్తుతం ఆయన లేని లోటును తీర్చే పనిలో ఉన్నారు.పునీత్ అభిమానులు ఏ వేడుకకు పిలిచినా కూడా కన్నీటి పర్యంతమవుతూ ఆ వేడుకలకు హాజరవుతున్నారు కూడా.

Advertisement

తాజా వార్తలు