సందీప్ వంగ డైరెక్షన్ లో నటించలేనని చెప్పిన స్టార్ హీరోయిన్...

బోల్డ్ కంటెంట్ తో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

( Sandeep Reddy Vanga ) ఆయన చేసిన అర్జున్ రెడ్డి సినిమా నుంచి అనిమల్ సినిమా వరకు అన్ని సినిమాలు కూడా బోల్డ్ కంటెంట్ తోనే ఉండడం విశేషం.

ఇక తనదైన మార్కును చూపిస్తూ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు.ఆయన సినిమాలు చూడాలంటే ముందుగా కంప్లీట్ ఆయన వరల్డ్ లోకి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది.

ఒక్కసారి ఆయన సినిమాలను చూసామంటే ఇక ఆయన సినిమాలకు అడిక్ట్ అవ్వడం పక్క అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇప్పుడున్న యూత్ మొత్తం అతన్ని ఫాలో అవుతున్నారు అంటే ఆయన ఎలాంటి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో( Prabhas ) స్పిరిట్( Spirit ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిమీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

Advertisement

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ ని( Mrunal Thakur ) ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని సందీప్ రెడ్డి వంగ అనుకుంటున్నారట.కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మృణాల్ ఠాకూర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చేయడానికి సిద్ధంగా లేనని తెగేసి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా ఆమెను ఈ సినిమాలో తీసుకోవాలని సందీప్ అనుకున్నాడా? లేదంటే ఇదొక రూమర్ గానే వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.నిజానికి మృణాల్ ఠాకూర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో నటించడానికి సిద్ధంగానే ఉన్నప్పటికి కావాలనే కొంతమంది ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తూ రాస్తున్నారని మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో నటించాలంటే హీరోయిన్లకు చాలా గట్స్ ఉండాలి.ఎందుకంటే ఆయన సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి.వాటిని చేయడానికి హీరోయిన్లు ఒప్పుకుంటేనే ఆయన సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటాడు.

లేకపోతే మాత్రం ఆయన సినిమాలో హీరోయిన్లు గా పనికిరారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక స్పిరిట్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్క అంటూ సందీప్ రెడ్డి వంగ భారీ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నాడు.

ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?
Advertisement

తాజా వార్తలు