ఆ స్టార్ హీరోతో అనుష్క శర్మ ఎఫైర్ నిజమేనా.. అలా కామెంట్లు చేయడంతో?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క శర్మ( Anushka Shamra ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోయిన్ కు సోషల్ మీడియాలో అంచనాలకు మించి ఫ్యాన్ బేస్ ఉంది.

అనుష్క శర్మ క్యూట్ లుక్స్ కు తెలుగు రాష్ట్రాల్లోని ఎంతోమంది ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా కాఫీ విత్ కరణ్( Koffee with Karan ) ఎనిమిదో సీజన్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీలో ప్రసారమవుతోంది.

ఈ షోలో రణవీర్ ప్రముఖ హీరోయిన్ తో డేటింగ్ చేసి విడిపోయిన తర్వాత దీపికా పదుకొనేను కలిశానని అన్నారు.

అనుష్క శర్మ సైతం రణవీర్( Ranveer Singh ) తో డేటింగ్ గురించి గతంలో చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రజలకు మా గురించి బాగా తెలుసని మేమిద్దరం విభిన్నమైన వ్యక్తులమని ప్రజలు గమనించారని ఆమె పేర్కొన్నారు.మా ఇద్దరి మధ్య స్థిరమైన బంధం లేదని అనుష్క శర్మ అన్నారు.

Advertisement

మేము ఇద్దరం ఒకరినొకరు చంపుకోవచ్చని అతని విషయంలో నేను కోపంగా ఉన్నానని అతని తల తీసేయగలనని ఆమె చెప్పుకొచ్చారు.అతడు కూడా అదే విధంగా చేయగలడని ఆమె తెలిపారు.

మేమిద్దరం రిలేషన్( Relation ) లో ఉండాల్సి వస్తే విభిన్నంగా ఉండాలని కోరుకుంటామని అనుష్క శర్మ అన్నారు.మేము లైఫ్ ను వేర్వేరుగా చూస్తామని ఆమె వెల్లడించారు.

నేను చాలా ప్రాక్టికల్ వ్యక్తిని కాదని అతను ప్రాక్టికల్( Practical person ) అని రణవీర్ గురించి అనుష్క శర్మ అన్నారు.నేను అతడిని ఇష్టపడతానని రిలేషన్ షిప్ లో ఉంటే అవతలి వ్యక్తి కూల్ చేయాలని అలా చేయని పక్షంలో ఆ రిలేషన్ కు అర్థం ఉండదని ఆమె పేర్కొన్నారు.అనుష్క వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు