అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ వైరల్!

మరో 24 గంటల్లో విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ( Kushi Movie ) థియేటర్లలో విడుదల కానుంది.

హైదరాబాద్ లో ఖుషి మూవీ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉండగా బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నాయి.

సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బుకింగ్స్ ఊహించని స్థాయిలో పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

నాకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే పెళ్లి( Vijay Deverakonda marriage ) చేసుకుంటానని విజయ్ దేవరకొండ అన్నారు.ఎవరో ఒత్తిడి చేస్తున్నారని నేను నిర్ణయం తీసుకోనని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు.ఒకవేళ అన్నీ కుదిరితే మాత్రం పెద్దగా హడావిడి లేకుండా పెళ్లి చేసుకుంటానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

నా ఇష్టాయిష్టాలు మెచ్చే అమ్మాయి, అన్నీ షేర్ చేసుకునే అమ్మాయి లైఫ్ లోకి రావాలని కోరుకుంటున్నానని ఆయన కామెంట్లు చేశారు.నా భార్య నాకు చిన్నచిన్న విషయాలు గుర్తు చేసేలా ఉండాలని తినడం దగ్గరనుంచి హాలిడే వరకు చాలా విషయాలను నేను మరిచిపోతూ ఉంటానని విజయ్ దేవరకొండ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

నన్ను చేసుకోబోయే అమ్మాయి ఆ విషయాలను గుర్తు చేయాలని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.నాకు కాబోయే భార్య( Future Wife ) కొంచెం ఇంటెలిజెంట్ అయ్యి ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు.

తాను ఎంజాయ్ చేసేవి నా భార్య కూడా ఎంజాయ్ చేసేలా ఉంటే బాగుంటుందని విజయ్ దేవరకొండ కామెంట్లు చేస్తున్నారు.విజయ్ దేవరకొండ ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం( Vijay Deverakonda Remuneration ) తీసుకున్నారని తెలుస్తోంది.విజయ్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు