గుణ‌శేఖ‌ర్‌ హిర‌ణ్య‌క‌శ్య‌పుడు హీరో ఫిక్సే

టాలీవుడ్‌లో గుణ‌శేఖ‌ర్ అన్న పేరు అంద‌రూ మ‌రిచిపోయిన టైంలో రుద్ర‌మ‌దేవి సినిమాతో స‌డెన్‌గా సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు మంచి హిట్ కొట్టి స‌త్తా చాటాడు క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌.

గ‌తంలో స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి హిట్లు కొట్టిన గుణ‌శేఖ‌ర్ ఆ త‌ర్వాత వ‌రుస ప్లాపుల‌తో ఫామ్ కోల్పోయాడు.

ఇక త‌న డ్రీం ప్రాజెక్టు అయిన రుద్ర‌మ‌దేవి సినిమా కోసం త‌న స‌ర్వ‌స్వాన్ని ప్రాణంగా పెట్టి రెండేళ్ల పాటు ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమా తెర‌కెక్కించాడు.రుద్ర‌మ‌దేవి సినిమా హిట్ అయ్యి రూ.55 కోట్ల షేర్ రాబ‌ట్టి గుణ‌శేఖ‌ర్ స్టామినా ఏంటో చెప్పింది.ఈ సినిమా త‌ర్వాత గుణ‌శేఖ‌ర్‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు, అగ్ర నిర్మాత‌లు సైతం క్యూలో ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే రుద్ర‌మ‌దేవి ఇచ్చిన జోష్‌తో గుణ‌శేఖ‌ర్ భ‌క్త ప్ర‌హ్లాద - హిర‌ణ్య‌క‌శ్య‌ప స్టోరీ ఆధారంగా హిర‌ణ్య‌క‌శ్య‌ప అనే మ‌రో స్క్రిఫ్ట్ రెడీ చేసుకున్నాడు.ఈ సినిమాను అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తెర‌కెక్కించేందుకు ఆయ‌న రెడీ అవుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో కీల‌క‌మైన హిర‌ణ్య‌క‌శ్య‌ప రోల్ కోసం గుణ ఇప్ప‌టికే ఎంతో మంది హీరోల‌ను అప్రోచ్ అయ్యాడు.లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం గుణ‌కు హిర‌ణ్య‌క‌శ్య‌పుడు దొరికేశాడు.

Advertisement

ఇటీవ‌ల రానాతో గుణ‌శేఖ‌ర్ భేటీ అవ్వ‌డం, స్క్రిప్టు మొత్తం వివ‌రించ‌డం.రానా ఓకే చెప్ప‌డం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

ఇక గ‌తంలో రుద్ర‌మ‌దేవి సినిమాలో చాళుక్య వీర‌భ‌ద్రుడిగా, బాహుబ‌లిలో బల్లాల‌దేవుడిగా న‌టించిన రానా ఇప్పుడు మ‌రోసారి ఈ హిస్టారిక‌ల్ సినిమాలో న‌టించేందుకు ఆస‌క్తితో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు