పూరి జగన్నాధ్ తో రెండో సినిమాకి కమిట్ అయిన స్టార్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకతను చాటుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.అందులో పూరి జగన్నాథ్(Puri Jagannadh ) ఒకరు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ ఆయనకు మాత్రం సక్సెస్ లు రావడం లేదు.ఎందుకంటే ఆయనే రొటీన్ ఫార్మాట్లోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

అందువల్లే తనకు స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడం లేదు.ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడం లేదు.

ఇక మొత్తానికైతే డబుల్ ఇస్మార్ట్( Double iSmart ) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేస్తున్న పూరి జగన్నాథ్ ఇప్పుడప్పుడే సినిమాలు చేయలేడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి.కానీ వాటికి చెక్ పెడుతూ పూరి జగన్నాథ్ గోపీచంద్( Gopichand ) తో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే ఇప్పుడు వినిపిస్తున్నాయి.ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు గోలీమార్ అనే సినిమా వచ్చింది.

Advertisement

ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా మరొక సినిమా రూపొందిస్తున్నారా లేదంటే ఫ్రెష్ కథతో ఇప్పుడు సినిమాని చేస్తున్నారా అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు అయితే ఉంది.

కానీ గోపిచంద్ తో ఎలాంటి సినిమా చేస్తాడు దానిని సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటికే గోపీచంద్ శ్రీనువైట్ల లాంటి ఒక సీనియర్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా విషయం లోనే గోపీచంద్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమా సక్సెస్ అయితే పూరి జగన్నాథ్ తో గోపీచంద్ సినిమా ఉంటుంది.

లేకపోతే మాత్రం గోపీచంద్ కూడా పూరి జగన్నాథ్ తో సినిమా చేసే అవకాశాలు లేవు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు