రాజమౌళి అతి జాగ్రత్తే మహేష్ మూవీ పాలిట శాపంగా మారిందా.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి( Tollywood director Rajamouli ) గురించి మనందరికీ తెలిసిందే.

ఇప్పటివరకు ఆయన కెరియర్ లో దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి.

ఈ మధ్యకాలంలో విడుదల అయిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ ( Baahubali, RRR )లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి.దీంతో జక్కన్న క్రేజ్ మరింత పెరిగింది.

ఆ సంగతి పక్కన పెడితే మామూలుగా రాజమౌళి ఒక్కొక్క సినిమాను రూపొందించడానికి ఎంత లేదన్న రెండు నుంచి మూడు వేల సమయం తీసుకుంటూ ఉంటారు.అయితే సినిమాను తెరకెక్కించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.

సినిమా నుంచి చిన్న క్లూ కూడా బయటికి రాకుండా, అసలు సినిమా జరుగుతోందా లేదా అన్నట్టుగా సినిమాను పూర్తి చేసేస్తూ ఉంటారు.రాజమౌళితో సినిమా అంటే పెద్ద పెద్ద హీరోలు అయినా సరే ఆయన పెట్టే రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే.అందుకే ఆయన దర్శకత్వం వహించే సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తూ ఉంటాయని చెప్పాలి.

Advertisement

కానీ ఈ విషయంలో ఇప్పుడు రాజమౌళి కాస్త ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో కలిసి ఒక సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు రాజమౌళి.

ముఖ్యంగా హాలీవుడ్ ( Hollywood )ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు కూడా వినిపించాయి.ఆ సంగతి అటు ఉంచితే.ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు అలాగే చిత్ర బృందం అందరూ కూడా ఇటీవల హైదరాబాదులో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ప్రస్తుతం ఒడిశాలో సెకండ్ షెడ్యూల్ కొనసాగిస్తున్నారు.

ఈ విషయాన్ని రాజమౌళి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నీ కూడా లీక్ అవుతూనే ఉన్నాయి.ఈ విషయాలన్నీ కూడా గోప్యంగా ఉండాలి.అలానే రాజమౌళి కూడా రివీల్ చేయలేదు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

కానీ ఎలాగోలా ఈ సినిమాకు సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూనే ఉన్నాయి.దీంతో మహేష్ బాబు అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు.

Advertisement

ఇప్పటికైనా జక్కన్న ఈ లీకుల బెడదకు అడ్డుకట్ట వేస్తారా లేదా చూడాలి మరి.అయితే ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి లీక్ లు బయటకు వస్తూ ఉండడంతో రాజమౌళి అతి జాగ్రత్త కారణంగానే ఇలా జరుగుతోంది అంటూ మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు.

తాజా వార్తలు