Rajamouli : రామాయణం, మహాభారతం రాజమౌళికే వదిలేయండి.. మీకు ఎప్పటికీ చేత కాదంటూ?

ఇండియన్ సినిమాలలో( Indian movies ) పౌరాణికాల విషయానికి వస్తే వాటిని తెరకెక్కించడంలో తెలుగు దర్శకుల తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు.

సీనియర్ ఎన్టీఆర్ హయాంలో తెలుగులో అత్యద్భుతమైన పౌరాణిక సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

రామాయణం, మహాభారతం( Ramayanam , Mahabharatam ) మీద తెలుగులో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.అవన్నీ కూడా అద్భుతమైన విజయాలు సాధించాయి.

వేరే ఏ భాషలో అయినా పౌరాణికాలను తెలుగు చిత్రాలతో కనీసం పోల్చడానికి కూడా వీల్లేని స్థాయిలో మన దర్శకులు, ఆర్టిస్టులు అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారు.

Ss Rajamouli Power In Mythological Concepts

అయితే ఒకప్పుడు అంత మంచి సినిమాలను చూసిన ప్రేక్షకులకు ఆదిపురుష్ సినిమా నచ్చడం లేదు.ముఖ్యంగా నిన్నటి తరం ప్రేక్షకులు ఈ సినిమాను చూసి బాగా హర్ట్ అయ్యారు.రామాయణాన్ని చెడగొట్టారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చిత్ర బృందం పై మండిపడుతున్నారు.

Advertisement
Ss Rajamouli Power In Mythological Concepts-Rajamouli : రామాయణం,

ఈ సినిమా తర్వాత నేటి తోజుల్లో పౌరాణిక చిత్రాలను డీల్ చేయగలే దర్శకులు వాటికి న్యాయం చేయగలిగే ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారన్న ప్రశ్న చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న.అయితే రాజమౌళి( Rajamouli ) ఒక్కడే ఇలాంటి సినిమాను సరిగ్గా డీల్ చేయగలడన్నది అందరి నమ్మకం.

యమదొంగ చిత్రంలో యమలోకంలో సన్నివేశాలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

Ss Rajamouli Power In Mythological Concepts

జానపద చిత్రమైన బాహుబలి( Bahubali ) చూశాక ఆయన పౌరాణిక చిత్రాన్ని మరింత బాగా డీల్ చేయగలడన్న నమ్మకం కుదిరింది.అందుకే ఆయన తీస్తానన్న మహాభారతం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈలోపు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం పై ఆదిపురుష్ తీసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

బాలీవుడ్లో మరో రామాయణం సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.అలాగే మహాభారతం మీదా సినిమాలు చేసే ప్రయత్నంలో వేరే దర్శకులు ఉన్నారు.కాగా ఉత్తరాది వాళ్లు సైతం రాజమౌళి మాత్రం ఇలాంటి సినిమాలకు కరెక్ట్ అని వాటిని ఆయనకు వదిలేసి వేరే సినిమాలు చేసుకోవడం బెటర్ అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు