సన్ని లియోన్ ని వాడుకుంటున్నాడు

సన్ని లియోన్ అంటే మాస్ జనాలకి కిక్కు.

ఒక్క అగ్రహీరోతో కూడా సినిమా చేయకుండా సన్ని తన సినిమాలకి ఓపెనింగ్స్ రాబడుతోందంటే, దానికి కారణం మాస్ ప్రేక్షకులే.

ఎందుకంటే వాళ్ళకి సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్.కథ బాగుందా,కథనం బాగుందా,లాజిక్ ఏంటి .ఇవేవి పట్టించుకోరు.అందుకే సినిమా ఎలా ఉన్నా, తొలి మూడురోజులు సన్ని సినిమాలకి మాస్ జనాలు బండి కడతారు.

మరి బాలివుడ్ హీరోల్లో మాస్ ని ఆకట్టుకునేది ఎవరు? ఇంకెవరు .సల్మాన్ ఖాన్.మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ మన భాయ్ ది.ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లది క్లాస్ ఫాలోయింగ్ అయితే, సల్మాన్ ది యూత్ అండ్ మాస్ ఫాలోయింగ్.ఈ రంజాన్ పండక్కి, సల్మాన్ తో పోటిపడుతున్నాడు షారుఖ్.

సల్మాన్ "సుల్తాన్", షారుఖ్ "రయీస్" .ఈ రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల కానున్నాయి.మరి ఓపెనింగ్స్ రావాలంటే మాస్ ప్రేక్షకుల అండ ఖచ్చితంగా కావాలి.

Advertisement

సల్మాన్ ప్రేక్షకులని తనవైపు తిప్పుకోవాలంటే సన్ని లియోన్ సహాయం తీసుకోవాల్సిందే అనుకున్నాడు షారుఖ్.అందుకే రయీస్ లో ఐటమ్ సాంగ్ చేయిస్తున్నాడు.

ఎట్లా ఉంది షారుఖ్ వాడకం! .

Advertisement

తాజా వార్తలు