శ్రీవారి దేవాలయం బంగారు తాపడం పనులు వాయిదా.. కారణం చెప్పిన దేవస్థానం చైర్మన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుని వెళుతుంటారు.

అంతే కాకుండా భక్తులు వారి మొక్కులను తీర్చుకొని శ్రీవారికి తల నీలాలను సమర్పిస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే తాజాగా తిరుమల శ్రీవారి దేవాలయం బంగారు తాపడం పనులను వాయిదా వేశారు.ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు వాయిదా వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి వెల్లడించారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ తాపడం పనులు మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ గోవింద రాజస్వామి దేవాలయంలో బంగారు తాపడం పనులు రెండు సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి కాలేదని శ్రీవారి దేవలయనికి ఉన్న ప్రాధాన్యత దృష్ట పనులు వేగవంతంగా చేసేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని భావిస్తున్నామని వెల్లడించారు.

ఆరు నెలల కాల పరిమితి లో టెండర్లు పూర్తి చేసి పనులు మొదలు పెట్టేందుకు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.అంతే కాకుండా రథసప్తమికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.రథసప్తమి లో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి చేశామని వెల్లడించారు.

Advertisement

బంగారు తాపడం పనులకు బంగారంను భక్తులు కానుకగా ఇచ్చిన దాన్ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

వైకుంఠ ద్వార దర్శనాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వెల్లడించారు.10 రోజులపాటు శ్రీవారి దేవాలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచమని వెల్లడించారు.గత రెండు సంవత్సరాల కాలంలో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చిన విధంగానే ఈ సంవత్సరం కూడా తిరుపతిలో స్థానికుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు