మహా శివరాత్రి వేడుకలకు సిద్ధమైన శ్రీశైలం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధమైంది.

ఈ నెల 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లను దేవాలయ ముఖ్య అధికారులు ఏర్పాటు చేశారు.

ఇటు భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తరత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.అంతేకాకుండా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ వాహనాల దారి మళ్లించినట్లు ఎస్పి రఘువీర్ రెడ్డి వెల్లడించారు.

ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు విజయవాడకు వెళ్ళవలసిన భారీ వాహనాలు కర్నూల్ సిటీ లోని నంద్యాల చెక్ పోస్ట్, ఆత్మకూరు, దోర్నాల, విజయవాడ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేశామని ఎస్పీ రఘువీర్ రెడ్డి స్పష్టం చేశారు.భారీ వాహనాలు కర్నూల్ లోని నంద్యాల చెక్ పోస్ట్ నుంచి నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడకు వెళ్ళవలసి ఉంటుందని తెలిపారు.

Srisailam Is Ready For Maha Shivratri Celebrations Traffic Restrictions Are Thes

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రముఖ క్షేత్రం శ్రీశైలన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.దేవతామూర్తుల విగ్రహాలకు కొత్త హంగులను అద్దారు.ఉత్సవాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి రావడంతో అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement
Srisailam Is Ready For Maha Shivratri Celebrations Traffic Restrictions Are Thes

స్వామి దర్శనానికి భక్తులు ఐదు రోజుల ముందు నుంచే పాదయాత్ర ప్రారంభించి శ్రీశైలం చేరుకుంటారు.ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలోనే కైలాస ద్వారం మెట్ల మార్గంలోని వచ్చే భక్తుల కోసం భారీ షెడ్లను నిర్మిస్తున్నారు.

Srisailam Is Ready For Maha Shivratri Celebrations Traffic Restrictions Are Thes

ఇవాళ నుంచి వరుసగా భృంగి, హంస, మయూర, రావణా, పుష్ప పల్లకి, గజవాహనాలు ఉంటాయి.18 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ఉత్సవం, నంది వాహన సేవ, రుద్రాభిషేకం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు.19వ తేదీన అమ్మవారి రథోత్సవం, తెప్పోత్సవం ఉంటాయి.21వ తేదీన ఉత్సవాలు ముగుస్తాయి.ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలను తీసుకున్నామని దేవాలయా అధికారులు చెబుతున్నారు.

మరువైపు నేటి నుంచి రద్దీ బాగా పెరగడంతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను కూడా చేస్తున్నారు.

వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!
Advertisement

తాజా వార్తలు