R Balki : శ్రీదేవి మూవీపై ఆసక్తికర వాఖ్యలు చేసిన నిర్మాత.. పెట్టిన డబ్బులు తిరిగిరావు అన్నారంటూ?

దివంగతన నటి అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

శ్రీదేవి( sridevi ) భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతోనే ఉన్నాయి.

ఆమె ఇప్పటివరకు ఎన్నో సినిమాలు నటించి మెప్పించింది.తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టి పడేసింది.

కానీ ఊహించని విధంగా చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్ళిపోయింది.ఇది ఇలా ఉంటే శ్రీదేవి నటించిన సినిమాలలో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాకి ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పవచ్చు.

దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత ఈ చిత్రంతో శ్రీదేవి రీ ఎంట్రీ ఇచ్చారు.ఎలాంటి కమర్షియల్‌ హంగులు లేకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని చిత్ర నిర్మాత ఆర్‌ బాల్కి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

Advertisement

ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని ఆలోచించినా కూడా ఖర్చు ఎక్కువ కావడంతో ఇతర నిర్మాతలను సంప్రదించినట్టు తెలిపారు.అయితే నిర్మాతలు ముందుకురాలేదని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

దర్శకురాలు గౌరీశిండే( Gauri Shinde ) ఈ కథను సిద్ధం చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపించలేదు.హీరోయిన్‌ ఓరియెంటెడ్ మూవీ యూఎస్‌లో షూట్‌ అనగానే.హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టాలని ఎవరు అనుకుంటారు? అని పలువురు మాటలు అన్నారు.అంతేకాకుండా పెట్టిన డబ్బు తిరిగి రాదని కూడా అన్నారు.

అలాంటి సమయంలో రాకేశ్‌ ఝున్‌వాలాని కలిశాను.నిర్మాణం విషయంలో ఆయన సాయం చేయడంతో మా సినిమా పట్టాలెక్కింది.

అయితే ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ కంటే ముందు శ్రీదేవితో నేను వేరే సినిమా చేయాలనుకున్నాను.కాకపోతే అది పట్టాలెక్కలేదు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

అలాంటి సమయంలో గౌరీ శిండే రాసిన కథ విని ఆమెకు సరిగ్గా సరిపోతుందని భావించను.దర్శకురాలు చెప్పిన కథ విని శ్రీదేవి కూడా వెంటనే ఓకే అన్నారు అని ఆర్‌.

Advertisement

బాల్కి చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు