కుళ్లిన కొబ్బరి కాయ అశుభానికి సంకేతమా?

మన హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.ఏ పూజ చేసిన, ఏ శుభకార్యం చేసిన కొబ్బరికాయ ఉండాల్సిందే.

అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొబ్బరికాయ తీసుకువెళ్లడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది.అలాంటి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళితే అందరూ అశుభం అని భావించి చాలా బాధపడుతూ ఉంటారు.

Spoiled Coconut In Puja Is It A Bad Sign1-కుళ్లిన కొబ్బ

కానీ ఆలా బాధ పడాల్సిన అవసరం లేదని, భక్తితో సమర్పించటం ముఖ్యమని శ్రీ కృష్ణ భగవానుడు భవద్గీగతలో చెప్పారు.కొబ్బరికాయ కుళ్ళితే చెడు జరుగుతుందనేది ఒక అపోహ మాత్రమే.

ఒకవేళ కొబ్బరికాయ కుళ్లిందని బాధగా ఉంటే కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని మరల పూజ చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది సమంగా పగిలితే కోరుకున్న కోరికలు తీరతాయని అర్ధం.

Advertisement

అదే కొబ్బరికాయలో పువ్వు ఉంటే శుభసూచకం.అదే పెళ్లైన దంపతులు కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు ఉంటే వారికి త్వరలోనే సంతానం కలుగుతుందని అర్ధం.

కాబట్టి లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా కొబ్బరికాయ కుళ్ళితే మరొక కొబ్బరికాయను దేవుడికి సమర్పించండి.

Advertisement

తాజా వార్తలు