అంబానీ కుటుంబానికి 'స్పైడర్ మ్యాన్' థాంక్స్ చెప్పాడు... ఎలాగంటే?

స్పైడర్ మాన్( Spider-Man ).ఈపేరు తెలియని జనాలు దాదాపుగా ఉండనే ఉండరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

స్పైడర్ మాన్ అనేవాడు మార్వెల్ కామిక్స్( Marvel Comics ) ప్రచురించిన అమెరికన్ కామిక్ పుస్తకాలలో కనిపించే ఓ సూపర్ హీరో.రచయిత స్టాన్ లీ రూపొందించిన ఈ పాత్ర ప్రపంచ జనాలను ఎంతగానో రంజింపజేసింది.

దాంతో ఈ కామిక్స్ నే సినిమాలుగా తెరకెక్కించి కోట్ల రూపాయిలు కొల్లగొట్టారు.ఈ స్పైడర్ మాన్ అనే మూలకథలో, ఓ రేడియోధార్మిక సాలీడు కరవడంతో అందులోని ప్రధాన పాత్ర స్పైడర్ మాన్ లాగ మారిపోతుంది.

అక్కడితో కథ ఆరంభం అవుతుంది.

Advertisement

కామిక్స్ లో హిట్టైన ఈ పాత్ర విండితెరపై కూడా పెను సంచలనాలు సృష్టించింది.మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ పాత్ర బాగా ఎక్కేసింది.ఇప్పటికీ ఎవరినైనా చిన్నపిల్లల్ని అడిగి చూడండి.

మీ సూపర్ హీరో ఎవరని? ఠక్కున తడుముకోకుండా వారు స్పైడర్ మేన్ అని సమాధానం చెబుతారు.అంతలా ఈ పాత్ర జనాల్లోకి దూసుకుపోయింది.

దాంతో స్పైడర్ మేన్ సిరీస్( Spider-Man series ) చాలానే వచ్చాయి.ఇంచుమించుగా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సిరీస్లో ఒక సినిమా అయినా రూపుదిద్దుకుంటుంది.

ఇక అసలు విషయంలోకి వెళితే, ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం అతిరథమహారధుల మధ్యన ఎంతో అట్టహాసంగా జరగబోతుంది.ఈ ఈవేంట్‌కు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీల నటీనటులకు ఆహ్వానం అందింది.ఈ క్రమంలోనే హాలీవుడ్ స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ స్టార్ టామ్ హాలండ్ హాజరవ్వడం జరిగింది.దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
గుడ్లు ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!!

ఈ సందర్భంగా స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్."NMACC ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అంబానీ కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.

Advertisement

నేను ఎప్పటికీ మరచిపోలేని అద్భుతమైన అనుభవం." అని రాసుకొచ్చాడు.

తాజా వార్తలు