దేవర కథ గురించి వైరల్ వార్తల్లో నిజమెంత.. కొరటాల ఆ తప్పు చేసే ఛాన్స్ లేదా?

మామూలుగా సినిమాలు విడుదల అయ్యే ముందు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు విడుదల చేయడం అన్నది సహజం.

అదే కొంతమంది ట్రైలర్లో కథను రివీల్ చేస్తే మరికొందరు చేయరు.

ఈ మధ్య కాలంలో విడుదల అయ్యే ట్రైలర్లలో చాలా వరకు కథను రిలీజ్ చేస్తున్నారు.సినిమా విడుదలకు ముందే ట్రైలర్ రూపంలో కథను విడుదల చేస్తూ ప్రేక్షకులలో ఎగ్జైటింగ్ ని పెంచుతున్నారు.

కానీ ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ దేవర సినిమా( Devara movie) ట్రైలర్ ను చూసిన చాలామంది ప్రేక్షకులు ఎవరికి వారు రకరకాల కథలను అల్లేస్తున్నారు.

ఇటీవల కాలంలో ఒక ట్రైలర్ చూసిన తర్వాత కథ ఏమిటి అనేది అంచనా వేసి చెప్పడం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అన్నది బాగా అలవాటు అయిపోయింది.ఇటీవల దేవర సినిమా ట్రైలర్ ని చూసిన ప్రేక్షకులు రకరకాల కథలను అల్లేస్తున్నారు.సముద్రం మీద అధిపత్యం, ఒకటే ముఠా రెండుగా విడిపోవడం, ఇలా రకరకాల కథలు సోషల్ మీడియా నిండా దర్శనమిస్తున్నాయి.

Advertisement

కానీ కొరటాల శివ ఏమీ అషామాషీ డైరక్టర్ కాదు.ట్రయిలర్ లో ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా దాచిన కథ చాలా పెద్దదే.పెద్ద కథ కనుకే రెండు భాగాలు చేయాలని మొదటే డిసైడ్ అయ్యారు.

అంటే చాలా పెద్ద కథ వున్నట్లు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

కథ కన్నా కూడా బలమైన సీన్లు అల్లి వుంటారు.అందువల్ల ట్రయిలర్ లో మొత్తం కథ చెప్పేసారు కొరటాల అని అనుకోవడానికి లేదు.

Advertisement

మరి అసలు కథ ఏమిటి అన్నది తెలియాలి అంటే ఈ నెల 27 వరకు వేచి చూడాల్సిందే మరి.

తాజా వార్తలు