హోదా విష‌యంలో బాబు యూట‌ర్న్‌?!

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్న విష‌యం తెలిసిందే.

హోదా విష‌యంలో అడిగిన వారిని అడిగిన‌ట్టు తిట్టిపోసిన బాబు ఇప్పుడు హోదా కోసం పోరు చేస్తున్నారు.

అదేస‌మ‌యంలో అన్ని పార్టీల నూ క‌లుపుకొని పోయేందుకు రెడీ అయ్యారు.ఈ నేప‌థ్యంలోనే అఖిల ప‌క్షం ఏర్పాటు చేశారు.

దీంతో ఇంకేముంది .బాబు మారిపోయారు.హోదా కోసం పోరు చేస్తారు.

అని నేత‌లంతా భావించారు.గ‌త నెల్లో క‌మ్యూనిస్టులు ఇచ్చిన బంద్ పిలుపున‌కు కూడా బాబు స‌హ‌క‌రించారు.

Advertisement

రోడ్ల‌పైకి వ‌చ్చి సంఘీభావం తెలిపారు.ఆర్టీసీ బ‌స్సుల‌ను బంద్ చేయించారు.

మ‌రి ఇంత‌లా బాబు హోదా విష‌యంలో యూట‌ర్న్ తీసుకున్నార‌ని అంద‌రూ అనుకుంటున్న తరుణంలో మ‌రోసారి బాబు వివాదాస్ప‌ద వ్యాఖలు చేశారు.

తాజా వార్తలు