ప్రభాస్ ఎక్కువగా మాట్లాడకపోవడానికి అసలు కారణాలివే.. ఆ హీరోల కంటే చిన్నవాడినంటూ?

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ప్రభాస్( Prabhas ) ఒకరు.

కృష్ణంరాజు( Krishnam Raju ) వారసుడిగా ఈశ్వర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన అనంతరం రాఘవేంద్ర వర్షం వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈయన నటించిన ఈశ్వర్ సినిమా పర్వాలేదు అనిపించుకున్న రాఘవేంద్ర సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక వర్షం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ బాహుబలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇదివరకు నటించిన పాన్ ఇండియా సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి.

Advertisement

ఇక ఇటీవల కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయం సాధించింది.

ఇక ప్రభాస్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన పెద్దగా ఎవరితోనూ మాట్లాడరు .ఎక్కడికైనా వెళ్లిన రెండు ముక్కలలోనే తన ప్రసంగం ముగిస్తూ ఉంటారు.ఇలా ప్రభాస్ ఎక్కువగా మాట్లాడకపోవడానికి గల కారణాలను కూడా ఇటీవల తెలిపారు.

ప్రభాస్ బాల్యం మొత్తం కొంతమంది కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య గడిచిపోయింది అందుకే ఎవరైనా కొత్తవారు ఉంటే ఈయన మాట్లాడటానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.ఓపిక క్రమశిక్షణ అనే విషయాలను పెదనాన్న కృష్ణంరాజు నుంచి తెలుసుకున్న ప్రభాస్ తన కంటే ఇండస్ట్రీలో ఎంతో మంచి విజయాలను అందుకున్న వారందరూ ఉన్నారు.

చిరంజీవి రజనీకాంత్ వారందరి కంటే నేను చాలా చిన్న వాడిననీ ప్రభాస్ పలు సందర్భాలలో తెలియచేశారు.ఇలా విజయాలు వచ్చిన గర్వం తలకేక్కకూడదనే విషయం ప్రభాస్ నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పాలి.

తెలుగోళ్ల దెబ్బకు బాలీవుడ్ మాఫియా ప్యాంటు తడిసిపోతోంది?
Advertisement

తాజా వార్తలు