శాన్‌ఫ్రాన్సిస్‌కో పోలీసులకి కీలక ఆదేశాలు...!!!

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో టెక్నాలజీ పరగంగా చాలా ముందుండే నగరంగా పేరుంది.

ముఖ్యంగా దోషులని పట్టుకోవడంలో అక్కడ నిఘా, పోలీసు సంస్థలు ఉపయోగించే ఫేసియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్వేర్ వారికి మాంచి ఆయుధంగా ఉపయోగపడేది.

అయితే తాజాగా ఈ నగర చట్టసభ ప్రతినిధులు ఈ సాఫ్ట్వేర్ వాడకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించవద్దని సిటీ ఏజన్సీలు, పోలీసులకి కీలక ఆదేశాలు ఇచ్చారు.

శాన్‌ఫ్రాన్సిస్‌కో నగర బోర్డ్ సూపర్ వైజర్లు ఈ మేరకు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.అసలు సాఫ్ట్వేర్ పని తనం ఏమిటి ఎందుకు దీనిని నిషేధించారంటే.

ఏదైనా ఓ వీడియో లేదా ఫొటోగ్రాఫ్‌ ను చూపితే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా అతని ఆనవాలును గుర్తించేదే ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌.చిన్న చిన్న నేరస్తులని, అనుమానితులని పట్టుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తూఉంటారు.

Special Commands To San Francisco Police
Advertisement
Special Commands To San Francisco Police-శాన్‌ఫ్రాన్స�

అయితే ప్రతినిధులు తీసుకున్న తాజా నిర్ణయంలో ఇప్పుడు ఈ టెక్నాలజీ వారికి అందుబాటులోకి లేకుండా పోతోంది కానీ పోలీసులు ఈ టెక్నాలజీ ఉపయోగించాలి అంటే తప్పకుండా అనుమతి తీసుకుని చేయవచ్చని తెలిపారు.గత ఏడాది అన్నాపోలీస్‌లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో అనుమానితులను గుర్తించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగించారు.దాంతో పౌరహక్కుల నేతలు ఈ వ్యవస్థపై తీవ్ర అభ్యంతరం తెలపడంతో ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు