బన్నీ గట్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇది 'పుష్ప'రాజ్ అంటే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ).ఈయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ముందు నుండి స్టైల్ పరంగా అందరి హీరోల కంటే ముందు వరుసలో ఉండేవాడు.అందుకే మెగా హీరో అనే బ్రాండ్ నుండి స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ కు ఎదిగాడు.

ఇక పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈయన రేంజ్ మరింత పెరిగి పోయి ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా పిలిపించు కుంటున్నాడు.మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు పుట్టిన రోజు ( Allu Arjun Birthday ) జరుపు కుంటున్నారు.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ గత రెండు రోజుల నుండే సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తూ విషెష్ చెబుతున్నారు.ఇక ఈ రోజు ప్రముఖులు, ఫ్యాన్స్ నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు విషెష్ అందుకుంటున్నారు.

Advertisement

అల్లు అర్జున్ భారీ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్దీ మంది టాలెంటెడ్ హీరోల్లో ఒకరు.

పాన్ ఇండియా లెవల్లో బిగ్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలు పెరిగి పోయాయి.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ( Pushpa 2 The Rule ) సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంది.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.

ఈ టీజర్ పాన్ ఇండియా వరల్డ్ గా అందరిని అలరిస్తుంది.ఈ వీడియో మొత్తం పుష్పరాజ్ ను హైలెట్ చేసారు.దీంతో బన్నీ మరోసారి తనలోని నటనను బయటకు తీసాడు.

ఇదిలా ఉండగా ఇప్పుడు అంతా కూడా బన్నీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి మాట్లాడు కుంటున్నారు.ఈ పోస్టర్ లో బన్నీ వేషధారణ గురించి చర్చించు కుంటున్నారు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఒక బిగ్ స్టార్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లుక్ హాట్ టాపిక్ అయ్యింది.ఊహించని వేషధారణలో పుష్ప కోసం సిద్ధం కావడం అనేది అందరికి ఆశ్చర్య పరచడమే కాకుండా బన్నీ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పడం సినిమా పట్ల తనకు ఉన్న ఫ్యాషన్ మరోసారి బయట పడింది.

Advertisement

ఇక ఇది బన్నీ ఫ్యాన్స్ కు కూడా బిగ్గెస్ట్ ట్రీట్ అనే చెప్పాలి.ఈయన పోస్టర్ పై తోటి నటీనటుల నుండి కూడా స్పెషల్ అప్లాజ్ దక్కుతుంది.

తాజా వార్తలు