సీఎం జగన్ ఒత్తిడితో స్పీకర్ పని చేస్తున్నారు..: ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఏపీ స్పీకర్ ను వైసీపీ( ycp ) రెబెల్ ఎమ్మెల్యేలు కలిశారు.

తమపై ఆరోపణలకు ఆధారాలు ఏవంటే స్పీకర్ దగ్గర సమాధానం లేదని రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

సీఎం జగన్ ఒత్తిడితో స్పీకర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( MLA Kotamreddy Sridhar Reddy ) ఆరోపించారు.లిఖితపూర్వక సమాధానం ఇచ్చినా రశీదు అడిగితే స్పీకర్ ఇవ్వలేదని చెప్పారు.

Speaker Is Working Under The Pressure Of CM Jagan MLA Kotam Reddy, MLA Kotam Re

చట్టాలపై గౌరవం పోగొట్టేలా స్పీకర్ తీరు ఉందని ధ్వజమెత్తారు.రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేశారు.

సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా అనర్హత వేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.చట్టంపై గౌరవంతో స్పీకర్ ను కలిసి సమయం కావాలని కోరామన్నారు.

Advertisement

కోర్టులు, ప్రజా కోర్టుల్లోనే తమ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు