టాప్‌ 10 లో మన వాళ్లు అయిదుగురు.. నెం.1 మిస్

కాల గమనంలో 2021 వ సంవత్సరం కూడా ముగియబోతుంది.ఈ సంవత్సరం కరోనా వల్ల సినిమాలు చాలా తక్కువగా విడుదల అయ్యాయి.

కాని సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలు మరియు వారి అభిమానులు చేసిన హడావుడి మాత్రం తక్కువేం కాదు.ప్రతి ఏడాది చివర్లో గూగుల్‌ అయినా ట్విట్టర్ అయినా ఆ ఏడాదిలో అత్యథికంగా ట్రెండ్‌ అయిన వారి జాబితాను విడుదల చేస్తుంది.

సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం మరియు వారి గురించి జనాలు చర్చించుకోవడం ద్వారా సెలబ్రెటీలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూ ఉంటారు.ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న స్టార్స్ విషయానికి వస్తే టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ స్టార్స్ మెయిన్‌ ఉన్నారు.

సౌత్‌ ఇండియన్‌ సినీ లాంగ్వేజ్‌ ల్లో టాప్ 10 లో మొత్తం తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీ వారే ఉన్నారు.వారిలో అయిదుగురు తెలుగు వారు కాగా అయిదుగురు తమిళం వారు ఉన్నారు.ఇదే సమయంలో ట్విట్టర్‌ లో సౌత్‌ నెం.1 గా నిలిచింది మాత్రం విజయ్ అని చెప్పడంలో సందేశం లేదు.తమిళ సూపర్ స్టార్‌ విజయ్ ను ఆయన అభిమానులు ట్విట్టర్ ట్రెండ్స్ 2021 లో టాప్‌ లో నిలిపారు.

Advertisement

ఆ తర్వాత స్థానంను పవన్ కళ్యాణ్ నిలిచాడు.పవన్‌ కళ్యాణ్ నెం.2 గా నిలిచాడు.మూడవ స్థానంలో మహేష్ బాబు ఉన్నాడు.

నాల్గవ స్థానంలో సూర్య నిలిచాడు.గతంలో ఎప్పడు లేని విధంగా ఇంత మంచి స్థానం సూర్యకు ఈసారి దక్కింది.ఆ తర్వాత స్థానంలో ఎన్టీఆర్‌ ఉన్నాడు.

ఆరువ స్థానంలో అల్లు అర్జున్‌ ఉండగా ఏడవ స్థానంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నాడు.ఎనిమిదివ స్థానంలో రామ్‌ చరణ్‌ తొమ్మిదవ స్థానంలో ధనుష్ ఉండగా పదవ స్థానంలో అజిత్ ఉన్నాడు.అజిత్ ట్విట్టర్ లోనే లేడు.

అయినా కూడా ఆయన అభిమానులు అజిత్ ను టాప్ 10 లో నిలిపారు.ఆయన సినిమా విడుదల కారణంగా భారీ ఎత్తున ట్వీట్స్ పడ్డాయి.

సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా
Advertisement