తప్పు చేస్తే క్షమించండి... వైరల్ అవుతున్న యాంకర్ రష్మీ పోస్ట్?

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఎక్స్ట్రా జబర్దస్త్ (Extra Jabardasth) కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రష్మీ(Rashmi) ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రతి ఆదివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక ఈ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో సీరియల్ నటుడు అంబంటి అర్జున్ వ్యాఖ్యతగా వ్యవహరించేవారు.

అయితే ఆ సమయంలో ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రేక్షకాదరణ రాకపోవడంతో రంగంలోకి సుడిగాలి సుదీర్(Sudigali Sudheer) వచ్చారు.

Anchor Rashmi Post Going Viral Details, Extra Jabardasth,rashmi,sridevi Drama C

సుధీర్ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయం నుంచి ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ వచ్చింది.ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో యాంకర్ రష్మీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.రష్మీ యాంకరింగ్ చేస్తే ఆ షో ఎలాంటి ఆదరణ పొందుతుందో మనకు తెలిసిందే.

Advertisement
Anchor Rashmi Post Going Viral Details, Extra Jabardasth,Rashmi,Sridevi Drama C

అయితే ఈ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా అడుగుపెట్టి ఏడాది కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు వివిధ రకాలుగా వీడియోలు ఎడిటింగ్ చేసి ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే రష్మీ సైతం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

Anchor Rashmi Post Going Viral Details, Extra Jabardasth,rashmi,sridevi Drama C

శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చి ఏడాది కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.ప్రతి సండే నాకు ఎంతో స్పెషల్ అవుతుంది.ప్రతి ఒక్కరూ ఆదివారం ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు.

ఈ కార్యక్రమం అందరికీ నచ్చిందని తెలిసి ఎంతగానో సంతోషిస్తున్నాను ఇలాగే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగిన మమ్మల్ని క్షమించాలని ఈ సందర్భంగా ఈమె అభిమానులను కోరుతూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు