కాసేపట్లో సీఎం జగన్ నివాసానికి వైఎస్ షర్మిల..!!

ఏపీ సీఎం జగన్ నివాసానికి మరికాసేపటిలో వైఎస్ షర్మిల వెళ్లనున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు బ్రదర్ అనిల్ చేరుకున్నారు.

మరికాసేపటిలో షర్మిలతో పాటు కుటుంబ సభ్యులు రానున్నారు.గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి ఫ్యామిలీతో కలిసి వెళ్లనున్నారు షర్మిల.సాయంత్రం 4.30 గంటలకు సీఎం జగన్ కు షర్మిల పెళ్లి పత్రిక ఇవ్వనున్నారు.తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సీఎం జగన్ ను షర్మిల ఆహ్వానించనున్నారు.

జగన్ ను ఆహ్వానించిన తరువాత షర్మిల ఢిల్లీకి బయలుదేరనున్నారు.రేపు కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో షర్మిల హస్తం గూటికి చేరనున్నారన్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఎయిర్ పోర్టులో బ్రదర్ అనిల్ ను టీడీపీ నేత బీటెక్ రవి కలిశారు.

Advertisement
మీ ముఖం గ్లాస్ స్కిన్ లా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!

తాజా వార్తలు