ఏపీ యువతికి సహాయం చేసి మాట నిలబెట్టుకున్న సోనూసూద్.. ఈ రియల్ హీరోకు సాటిరారుగా!

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ నటుడు సోనూసూద్( Sonu Sood ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈయనకు టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలో అయిందో మనందరికీ తెలిసిందే.

సినిమాలలో విలన్ పాత్రల్లో నటించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం వేలాది మందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు.అప్పుడెప్పుడో కరోనా వచ్చినప్పుడు మొదలైన తన సేవా గుణం ఇప్పటికీ తన గొప్ప మనసును చాటుకుంటూనే ఉన్నాడు.

ఆపద వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ వస్తున్నారు.

ఇప్పటికే ఎంతోమందికి సహాయం చేసిన సోనూసూద్ తాజాగా ఒక అమ్మాయికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని( Andhra Pradesh ) బనవనూరుకు చెందిన దేవికుమారీ( Devikumari ) అనే అమ్మాయి చదువుకు కావాల్సిన సాయం చేశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ దేవి కుమారి తాజాగా ట్విట్టర్ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

Advertisement

ఆ పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చారు.మా కుటుంబం ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

కానీ, నాకు చదువుపై ఎంతో ఆసక్తి ఉంది.ఇంట్లో ఉన్న పరిస్థితుల రీత్యా తల్లిదండ్రులు నా చదువును ( Education ) మధ్యలోనే నిలిపివేయాలనుకున్నారు.

నా కలలన్నీ ఆవిరయ్యాయని బాధ పడ్డాను.అలాంటి సమయంలో సోనూసూద్‌ సర్‌ నాకు అండగా నిలిచారు.

నా చదువుకు కావాల్సిన సాయం చేశారు.ఆయన నాకు దేవుడితో సమానం అని దేవి కుమారి రాసుకొచ్చింది.అయితే ఈ పోస్ట్ పై స్పందించిన సోనూసూద్ మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు థ్యాంక్యూ.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

బాగా చదువుకోండి.కాలేజీ అడ్మిషన్‌ తీసుకున్నాం.

Advertisement

ఈ ఆంధ్రా అమ్మాయి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకునేలా, ఆమె కుటుంబం గర్వపడేలా చేద్దాం.ఈ విషయంలో నాకు మార్గదర్శకంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు అని తెలిపారు.

దీంతో మరోసారి సోషల్ మీడియాలో సోనూసూద్ పేరు మారుమోగుతోంది.

తాజా వార్తలు