రియల్ హీరోకి 100 అడుగుల అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని..

భారతదేశంలో సెలబ్రిటీలు అంటే దాదాపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎక్కువగా ఉంటారు.

చాలా తక్కువగా రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు, అలాగే వ్యాపారవేత్తలు మాత్రమే ఈ లిస్టులో ఉంటారు.

ఇకపోతే కరోనా సమయంలో రియల్ హీరోగా( Real Hero ) పేరు తెచ్చుకున్న వ్యక్తి సోనూసూద్.( Sonu Sood ) భౌతికంగాను, ఆర్థికంగానూ సాయపడిన వ్యక్తిగా ఆయన పేరుగాంచారు.

సోనూసూద్ చారిటీస్( Sonu Sood Charities ) అనే పేరుతో ఆయన అనేక మంచి పనులతో సినిమాల్లోనే కాకుండా బయట వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇకపోతే తాజాగా సోనుసూద్ పుట్టినరోజు( Sonu Sood Birthday ) సందర్భంగా ఆయన అభిమానులు అతనిపై గౌరవాన్ని 100 అడుగుల ఎత్తున రూపంతో ప్రదర్శించాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన కళాకారుడు పురుషోత్తం( Purushottam ) సోనుసూద్ ముఖచిత్రాన్ని అందంగా వేశాడు.ఇప్పుడు ఈ కలకడానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

Advertisement

జనాల గుండెల్లో అభిమానం సంపాదించాలంటే ప్రజలకు ఎంతో మేలు చేసి ఉంటేనే స్థానం సంపాదించుకోవచ్చు.కష్టాల్లో ఉన్నామని తెలిస్తే చాలు అందుకు సంబంధించి సినీ నటుడు వారికి ఎలాంటి అవసరం ఉందో తెలుసుకుని సహాయం చేయడం మనం సోషల్ మీడియాలో చాలా సార్లు చూసాము.ఇక పుట్టినరోజు సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తంతో పాటు కుప్పం హాకింగ్ ఇంటర్నేషనల్ పాఠశాల ఆధ్వర్యంలో సుమారు 100 అడుగుల పొడవున 1200 విద్యార్థులను ఉపయోగించి ఫోటోని అద్భుతంగా వేశాడు.

ఈ అద్భుతాన్ని పురుషోత్తం సోనుసూద్ పుట్టినరోజు గిఫ్ట్ గా అంకితం చేస్తున్నట్లుగా పూరి ఆర్ట్స్ పురుషోత్తం, హాకింగ్ స్కూల్ యాజమాన్యం తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు