Anasuya Bhardwaj : కొడుకుల కష్టాలను భరించలేకపోతున్న అనసూయ.. బాదను మొత్తం బయట పెట్టేసిందిగా?

అనసూయ భరద్వాజ్ ( Anasuya Bhardwaj ) పరిచయం అవసరం లేని పేరు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ తనకు ఏమాత్రం విరామం దొరికిన తన కుటుంబంతో కలిసి సరదాగా గడపడం కోసం ఇష్టపడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఈమె తరచూ వెకేషన్ కి కూడా వెళ్తూ ఉంటారు.

ఇలా ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే అనసూయ తన పిల్లలకి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఈమె షేర్ చేసినటువంటి పోస్ట్ విషయానికి వస్తే ఈమెకు తన పిల్లల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని తన బాధను మొత్తం బయటపెట్టారు.

అనసూయకు ఇద్దరు అబ్బాయిలే అనే విషయం మనకు తెలిసిందే.వీరిద్దరికి ఇంకా 10 ఏళ్లలోపు వయసు ఉంటుంది దీంతో తన పిల్లలు వల్ల తనకు కలిగే ఇబ్బందులను ఈమె తెలియజేశారు.

Advertisement

తన ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు కావడంతో వారి ప్యాంట్ జోబులో ఉన్నటువంటి వస్తువులను తీసి బయట పెట్టడం వారికి ఇంకా తెలియలేదని అయితే జోబి కాలి చేయకుండా ఉండటం వల్ల తాను కూడా అలాగే వాషింగ్ మిషన్ లోకి వేయడంతో వాషింగ్ మిషన్ ( Washing machine )ప్రతి రెండు నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఈమె తెలిపారు.ఇలా పిల్లలకి తెలియని కారణం చేత వాషింగ్ మిషన్ తరచూ పాడవుతోందని అనసూయ వెల్లడించారు.మరి మీ ఇంట్లో కూడా మీకు ఇదే ఇబ్బంది ఎదురవుతుందా అంటూ ఈమె తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

అదేవిధంగా డస్ట్ బిన్ కనిపించే వరకు ఎవరైతే పేపర్స్ తమ జేబులో ఉంచుకుంటారో అలాంటివారు అంటే తనకు ఎంతో గౌరవం అంటూ కూడా ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు.ప్రస్తుతం తన కొడుకుల వల్ల ఈమె వాషింగ్ మిషన్ పాడవుతుంది అంటూ అనసూయ షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక ఈ విషయంపై నేటిజన్స్ కామెంట్లు చేస్తూ పిల్లలకు తెలియకపోతే తెలియ చెప్పాలి కదా అనసూయ అంటూ కామెంట్లు చేయగా వారు జోబి కాలి చేయకపోతే నేను నువ్వు చేయొచ్చు కదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు