టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సోనియాగాంధీ..!!

ఆదివారం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

దీంతో ప్రపంచ కప్ భారత్ గెలవాలని దేశ ప్రజలు.

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఆకాంక్షిస్తున్నారు.ఇదే సమయంలో సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు టీమిండియా కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ తెలియజేయడం జరిగింది.వరల్డ్ కప్ టోర్నీలో జట్టు ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

Sonia Gandhi Said All The Best To Team India Wc 2023, Sonia Gandhi, Ind Vs Aus

1983, 2011 లో ట్రోఫీలు గెలిచినప్పుడు దేశం ఎంతగానో సంతోషించింది.ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చింది.కచ్చితంగా ఈ జట్టు ఛాంపియన్ గా అవతరిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది.

Advertisement
Sonia Gandhi Said All The Best To Team India WC 2023, Sonia Gandhi, IND Vs AUS-�

దేశం మొత్తం మీ వెంట ఉంది.మీ విజయాన్ని ఆకాంక్షిస్తుంది.

అంటూ సోనియాగాంధీ వీడియో సందేశం విడుదల చేశారు.వరల్డ్ కప్ టోర్నీలో భారత్ మొదటి నుండి గెలుస్తూ ఉంది.

దీంతో పాయింట్లు పట్టికలో టాప్ లో ఉంది.ఆల్రెడీ ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టునీ ఓసారి ఓడించింది.

అయితే ఇప్పుడు ఫైనల్ లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతున్న నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది.కచ్చితంగా టీమిండియా విజయం సాధించాలని క్రికెట్ ప్రేమికులు దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

ధన త్రయోదశి అంటే ఏమిటి.. ఆరోజు విశిష్టతలు ఏమిటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు