ఒక కుర్రాడు తన తండ్రిని మద్యం బానిసత్వం నుంచీ బయటకి తీసుకురావాలని ప్రయత్నించాడు.చివరకి ఏమి చేయాలో తెలియక తనువు చాలించాడు.
తన చావుతో అయినా సరే తన తండ్రి మద్యం మానేస్తాడు అని ఓ పిచ్చి ఆలోచన తన ఎన్నో ఏళ్ల భవిష్యత్తు కలని చిద్రం చేసింది ఆ కుర్రవాడు రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.వివరాలలోకి వెళ్తే.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా గురుకుల్‌పట్టి చెందిన మాడసామి, ఈశాకి అమ్మాళ్ కుమారుడు ఉన్నాడు అతని పేరు దినేశ్ నల్లశివన్ (17).ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన దినేశ్ నీట్ పరీక్ష కోసం సిద్దమవుతున్నాడు.9ఏళ్ల క్రితమే తల్లి మరణించడంతో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి.తండ్రి తాగుడుకు బానిసయ్యాడు.
రోజూ ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవడం మాడసామికి నిత్యకృత్యం అయిపోయింది.ఈ క్రమంలోనే తన తండ్రి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అయితే అప్పటికీ తన తండ్రి వ్యవహారంలో మార్పు రాలేదు తన అప్పటికే తన తల్లిని కోల్పోయిన దినేశ్ తండ్రి ఇలా అయిపోవడం భరించలేక పోయాడు ఎలా అయినా సరే తాగుడు కి తన తండ్రిని దూరం చేయాలని అనుకున్నాడు ఒక లేఖని రాసి ఆత్మహత్యకి పాల్పడ్డాడు.
ఇప్పుడు అతడు రాసిన లేఖ అందరిని కంటతడి పెట్టిస్తోంది.ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన దినేశ్ నీట్ పరీక్ష కోసం సిద్దమవుతు భవిష్యత్తు కోసం ఎంతో పరితపించే దినేశ్ రాసిన లేఖ గుండెల్ని పిండేస్తోంది.
“ నాన్నా.నా చావుతోనైనా నువ్వు మారతావనుకుంటున్నాను.
ఇకనుంచైనా తాగుడు మానెయ్.కనీసం నా శవానికి తలకొరివి పెట్టేందుకైనా నువ్వు మద్యం తాగకుండా వస్తావనుకుంటున్నా.
అయినా తాగకుండాఉండలేను అంటే.నువ్వు మాత్రం దయుంచి నా అంత్యక్రియలకు రాకు.
అప్పుడే నా ఆత్మకు శాంతి లభిస్తుంది అంటూ దినేశ్ లేఖలో రాశాడు.దినేశ్ అక్కడితో ఆగలేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మద్యం షాపులను మూసేయాలని దినేశ్ విజ్ఞప్తి చేశాడు.
ఇకనైనా తమిళనాడులో మద్యం షాపులను మూసేయకపోతే నా ఆత్మనే వాటిని ధ్వంసం చేస్తుందని దినేశ్ లేఖలో పేర్కొనడం గమనార్హం.ఇప్పుడు దినేశ్ రాసిన లేఖ తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy