అప్పట్లో సైనికులకు పెట్టే ఆహారంపై సంచలన విమర్శలు చేసిన జవాన్‌ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణం అయ్యిందో తెలుసా?

రెండేళ్ల క్రితం ఇండియన్‌ ఆర్మీకి ప్రభుత్వం పెట్టే ఆహారం ఇది అంటూ సంచలన ఆరోపణలు చేసిన జవాన్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ గుర్తున్నాడు కదా, అతడిని మొదట బోర్డర్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసిన ఆర్మీ అధికారులు, ఆ తర్వాత ఉద్యోగం నుండే తీసేసినట్లుగా తెలుస్తోంది.

ఆర్మీ జవాన్‌ ఉద్యోగం పోవడంతో ఆయన ప్రైవేట్‌ ఉద్యోగంను చేసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

సోషల్‌ మీడియాలో ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అయిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారయ్యిందట.కొందరు ఆయన్ను హీరో అంటే మరి కొందరు మాత్రం దేశం పరువు తీశారంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఒత్తిడి చేసిందో లేదంటే ఆర్మీ సొంత నిర్ణయమో కాని తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ను ఉద్యోగం నుండి తొలగించడం జరిగింది.సరైన కారణం లేకుండానే ఆయన్ను కొన్నాళ్లకు తొలగించారు.ఆ విషయం జనాలకు పెద్దగా తెలియనే లేదు.

దేశ వ్యాప్తంగా ఈ విషయం తెలిస్తే తేజ్‌ బహదూర్‌కు మద్దతుగా నిలిచేవారేమో.కాని ఆయన ఈ విషయాన్ని ఇంకా జనాల్లోకి తీసుకు వెళ్లాలని భావించలేదు.

Advertisement

ఏదో ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న తేజ్‌ బహదూర్‌ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.

కుటుంబ కలహాలో లేదంటే ఆర్థిక ఇబ్బందుల వల్లో తెలియదు కాని తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ తనయుడు రోహిత్‌ యాదవ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.22 ఏళ్ల రోహిత్‌ తన రూంలో గన్‌ తో కాల్చుకున్నాడు.పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.

రోహిత్‌ ఆత్మహత్య సమయంలో తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ కుంభ మేళ కోసం ప్రయాగ్‌లో ఉన్నాడు.విషయం తెలుసుకున్న అతడు వెంటనే ఇంటికి చేరుకున్నాడు.

కన్నీరు మున్నీరు అయిన తేజ్‌ బహదూర్‌ను చూసి స్థానికులు కళ్లు చెమ్మగిల్లాయి.

సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే ఇవి రాత్రిపూట తింటే చాలు..!
Advertisement

తాజా వార్తలు