కరీంనగర్ లో దారుణం.. ఆస్తికోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..!

ప్రస్తుత కాలంలో ఆస్తి ఐశ్వర్యాలకు ఇచ్చే విలువ మానవ సంబంధాలకు, పేగు బంధాలకు ఇవ్వడం లేదు.

ఆస్తి కోసం కుటుంబ సభ్యులనే అత్యంత దారుణంగా హత్యలు చేసేస్తున్నారు.

కుటుంబ సభ్యుల కంటే బయటి వ్యక్తులే చాలా మేలు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో( Karimnagar ) బుధవారం చోటుచేసుకుని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.గన్నేరువరం మండలం రేణికుంటకు చెందిన తుమ్మనవేని కనకవ్వ(56)కు( Tummanaveni Kanakavva ) ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం.

కనకవ్వ భర్త గతంలో మృతి చెందాడు.కనకవ్వ పిల్లలందరికీ వివాహాలు అయ్యాయి.కుటుంబానికి చెందిన 1.20 ఎకరాల భూమిని కనకవ్వ కుమారుడు వినోద్ సాగు చేసుకుంటున్నాడు.కనకవ్వ కు ఆమె తండ్రి జంగంపల్లి శివారులో రెండు ఎకరాల భూమిని రాసి ఇచ్చాడు.

Advertisement

దానిని కౌలుకు ఇచ్చి కనకవ్వ జీవనం సాగిస్తోంది.అయితే ఆ రెండెకరాల భూమి తన పేరుపై రాయాలని వినోద్( Vinod ) గత కొన్ని నెలలుగా తల్లితో గొడవ పడుతున్నాడు.వినోద్ వేధింపులు భరించలేకపోయిన కనకవ్వ కొద్ది రోజుల క్రితం అద్దె ఇంటికి వెళ్లి నివాసం ఉంటుంది.

తాజాగా బుధవారం వినోద్ జంగంపల్లిలోని తల్లి భూమి వద్దకు వెళ్లి తానే పొలం సాగు చేసుకుంటానని పొలం పనులు ప్రారంభించాడు.

విషయం తెలిసిన కనకవ్వ అక్కడికి వెళ్లి కొడుకుతో గొడవకు దిగి, ఆ భూమి తీసుకుంటే తాను ఎలా జీవనం సాగించాలని కొడుకును నిలదీసింది.మరి మధ్య కాసేపు గొడవ జరిగిన తర్వాత కోపంలో ఉన్న వినోద్ తన చేతిలో ఉన్న పారతో తల్లి తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.కనకవ్వ కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు