నాకు ఈ పదవి వద్దు..సోము షాకింగ్ డెసిషన్

సోము వీర్రాజు ఈపేరు బహుశా ఏపీ తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు.

అంతేకాదు సోము వీర్రాజుని ఏపీ బీజేపి ఫైర్ బ్యాండ్ అని కూడా అంటారు.

గుజరాత్ ఎన్నికల ముందు వరకూ ఏపీ ప్రభుత్వం పై, చంద్రబాబు నాయుడిపై పెద్దగా విమర్శలు చేయకుండా ఉన్న సోము రిజల్ట్స్ తరువాత మాత్రం స్పీడు పెంచేశారు.మిత్రపక్షంగా ఉన్నామనే ఆలోచన కూడా చేయకుండా చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు.

అయితే ఈ రోజు వీర్రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు.భారతీయ జనతా పార్టీ నేతగా.

టిడిపి మిత్రభంధంతో టిడిపి ద్వార వచ్చిన ఎమ్మెల్సీ పదవికి సోము రాజీనామా చేస్తానని ప్రకటించారు.సాయంతో ఏపీలో.

Advertisement

టిడిపి మిత్రపక్షంగా ఉన్నపుడు తనకు వచ్చిన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు వీర్రాజే మీడియాతో చెప్పారు.మాకు టిడిపి ద్వారా సంక్రమించిన పదవులు ఏవైనా ఉంటే వదులుకోవడానికి వెనుకాడమని అన్నారు.

టిడిపి ద్వారా సంక్రమించిన ఇతర నామినేటెడ్ పదవులు కూడా వదిలేసుకుంటామని ప్రకటించారు.అంతేకాదు ఏపిఎన్ఎంఐడిసి ఛైర్మన్ పదవికి కూడా లక్ష్మీపతి రాజీనామా అందులో భాగామానే జరిగిందని.

మరింతమంది నేతలు తమ తమ పదవులకి రాజీనామాలు త్వరలోనే సమర్పిస్తారని అన్నారు.అయితే ముందు నుంచీ చంద్రబాబు బిజెపి నేతలకి పెద్దగా పదవులు కట్టబెట్టింది లేదు.

అంతేకాదు బిజెపి లో ఈ పదవులకి తగ్గట్టుగ ఉన్న వ్యక్తులు కూడా ఎవరు లేరని మిత్ర భంధం కనుకనే కనీసం ఆ పదవులు అయినా ఇచ్చారని అంటున్నారు టిడిపి నేతలు.ఒక పక్క ఏపీ ప్రజలు కేంద్రం చేసిన మోసం తో కోపంగా ఉన్నారని ఈ సమయంలో వారి దృష్టి మళ్ళించే ప్రయత్నంగా బిజెపి రాజీనామా డ్రామాలు ఆడుతోందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు