ఉగాదికి ఒక్కరోజు ముందు సూర్యగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

ఈ సంవత్సరం హోలీ రోజున మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడింది.అలాగే ఏప్రిల్ నెలలో మొదటి సూర్యగ్రహణం( Solar eclipse ) రాబోతూ ఉంది.

ఈ సూర్యగ్రహణం సరిగ్గా ఉగాదికి ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో సంభవిస్తుంది.సనాతన ధర్మం లో సూర్యగ్రహణం ఎంతో ముఖ్యమైనది.

మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8, 9 వ తేదీల మధ్య రాత్రి ఏర్పడబోతోంది.ఈ గ్రహణం 8వ తేదీ రాత్రి 9 గంటల 12 నిమిషములకు మొదలై మధ్యాహ్నం రెండు గంటల 22 నిమిషముల వరకు ఉంటుంది.

అలాగే గ్రహణానికి 12 గంటల ముందు సూతక్ కాలం మొదలవుతుంది.అయితే చంద్రగ్రహణం మాదిరి ఈ సూర్యగ్రహణం కూడా మన దేశంలో కనిపించదు.దీని కారణంగా భారతదేశంలో గ్రహణం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.

Advertisement

ఈ సంవత్సరం చైత్ర అమావాస్య ( Chaitra Amavasya )ఏప్రిల్ 8న, చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9న మొదలవుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.

గ్రహణ సమయంలో రాహు కేతువుల ప్రభావం అధికంగా ఉంటుంది.కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.

ఈ సూర్యగ్రహణం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.వృషభ, మిధున, సింహ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.కానీ మేష, తులా, కుంభ రాశుల( Mesha Rasi ) వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

అలాగే ఈ సూర్యగ్రహణం మెక్సికో మీదుగా అమెరికా, కెనడా( America, Canada )లో కనిపిస్తుంది.జ్యోతిష్య నిపుణుల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదు.గ్రహణ సమయంలో భగవంతుడిని తలుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Validation Check 2026
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 4, శనివారం 2023

సూర్య గ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడం మంచిది.సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష కళ్ళతో చూడకూడదని గుర్తుపెట్టుకోవాలి.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే సూర్యగ్రహణం భారత దేశంలో కనీపించదు.కాబట్టి ఈ గ్రహణం నియమాలు మన దేశంలో వర్తించవు.

తాజా వార్తలు