సోగ్గాడి లాభం ఎంతో తెలుసా?

అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది.

సంక్రాంతి కానుకగా బడా చిత్రాలతో పోటీ పడ్డ ఈ సినిమా రేసులో విజయం సాధించింది.

ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో ఢీ కొట్టిన సోగ్గాడు భారీ లాభాలను దక్కించుకున్నాడు.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సోగ్గాడు చిత్రం బడ్జెట్‌ 15 కోట్లు.

పబ్లిసిటీతో కలుపుకుని మొత్తంగా నాగార్జున ఈ సినిమా కోసం 15 కోట్లకు మించి ఖర్చు చేసి ఉండరు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్‌.ఇక ఈ చిత్రానికి ఇప్పటి వరకు 30 కోట్ల షేర్‌ వచ్చింది.

సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో భారీ కలెక్షన్స్‌ను ఈ చిత్రం కొల్లగొట్టింది.కలెక్షన్స్‌ రూపంలో వచ్చిన లాభాలు మాత్రమే కాకుండా శాటిలైట్‌ రైట్స్‌ మరియు ఆన్‌ లైన్‌ రైట్స్‌ రూపంలో కూడా నాగార్జునకు లాభాలు రాబోతున్నాయి.

Advertisement

శాటిలైట్‌ రైట్స్‌ మరియు ఆన్‌లైన్‌ రైట్స్‌కు కలిపి 8 కోట్లు వచ్చే అవకాశాలున్నాయి.అంటే మొత్తంగా నాగార్జునకు దాదాపుగా 25 కోట్ల లాభం సోగ్గాడు తెచ్చి పెట్టబోతున్నాడన్న మాట.ఈ లెక్కన చూసుకుంటే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం కంటే సోగ్గాడే పెద్ద విజయాన్ని సాధించినట్లుగా పరిగణించాలి.‘నాన్నకు ప్రేమతో’ చిత్రం నిర్మాతకు అయిదు కోట్ల లోపు లాభాలనే తెచ్చి పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.

Advertisement