అసలు విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా పోరాపాటులో కూడా మమ్మల్ని తిట్టుకోవద్దు.అసలేక్కడా మేం పరమశివుడిని అవమానించేందుకు ప్రయత్నించట్లేదు.
సోఫియా హయత్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా ? వినకపోతే ఆమె గురించి, ఆమె తిక్క తిక్క చేష్టల గురించి మరోసారి చెబుతాం వినండి.ఈ సోఫియా బ్రిటన్ నుంచి వచ్చి బాలివుడ్ లో ప్రయత్నాలు చేసింది.
కాని ఆమీ జాక్సన్ లా సక్సెస్ కాలేకపోయింది.ఆ తరువాత సన్యాసం తీసుకుంది.
కెరీర్ డిప్రెషన్ లో ఆ పని చేసింది ఏమో, సన్యాసం తీసుకున్నా, ఓ సన్యాసినికి ఉండాల్సిన మానసిక పరిణితి ఆమెకు లేదు.సన్యాసం తీసుకున్న కొన్నిరోజులకు కైలాష్ యాత్ర వెళ్ళినన సోఫియా, ఔరంగబాద్ దగ్గర ఉన్న ఓ శివలింగాన్ని సందర్శిచాకా ఓ సంచలన ప్రకటన చేసింది.
అదేంటంటే, సాక్షాత్తు పరమశివుడికి జన్మనిచ్చిన తల్లి ఎవరో కాదు, అది తనే అని.ఆ లింగాన్ని చూడగానే ఆమె లోనికి ఎదో దైవ శక్తి ప్రవేశించింది అంట.వెంటనే తన పూర్వ జన్మలు గుర్తుకు వచ్చాయట.అప్పుడే శంకరుడు ఎవరో కాదు, తన కన్నకొడుకు అని గుర్తుకు వచ్చిందట.
ఈమె పిచ్చికూతలను అప్పట్లో చాలామంది విమర్శించారు.ఎంత సినిమా ఇండస్ట్రీని వదిలేసినా, పబ్లిసిటి కోసం పాట్లు పడే సినిమా బుద్ధి మాత్రం పోలేదని హిందూమత పెద్దలు అప్పట్లో ఆమెని ఆడేసుకున్నారు.
ఆ తరువాత సన్యాసి అని చెప్పుకుంటూనే చిట్టి పొట్టి బట్టలతో ఇంస్టాగ్రామ్ లో హల్చల్ చేసిన సోఫియా, ఎవరో కుర్రాడితో కలిసి ఉన్న ఫోటోలు పెట్టడం మొదలుపెట్టింది.కట్ చేస్తే ఆతను ఆమె ప్రేమికుడు.
ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, ఇది కూడా దైవ నిర్ణయమే అంటూ మళ్ళీ కొత్తకథ మొదలుపెట్టింది.దైవ దర్శనం అంటూ పవిత్ర మక్కాను సందర్శించుకున్న సోఫియా, తమ పెళ్లిని ఏసు ప్రభువు స్వర్గంలో నిర్ణయించాడని, మా పెళ్ళికి పరమశివుడితో సహా ఇతర దేవుళ్ళు హాజరవుతారని డబ్బా కొట్టింది.
మొత్తానికి అన్ని మతాల దేవుళ్ళని కవర్ చేసి, మొన్న తన బాయ్ ఫ్రెండ్ ని ఈజిప్టియన్ స్టయిల్లో పెళ్ళాడింది.ఇప్పుడు జనాలకి పట్టుకున్న భయం ఏమిటంటే .ఇతను కేవలం నా ప్రేమికుడు కాదు, సాక్షాత్తు మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు అని ఎక్కడా మరో బాంబు పెల్చుతుందో !.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy