హైదరాబాద్‌ కు వచ్చిన పూరి పై సోషల్‌ మీడియా ట్రోల్స్‌

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్ ఈమధ్య కాలంలో సినిమాలతో కంటే కూడా అధికంగా ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు.

ఆయన వ్యక్తిగత విషయం అయినా కూడా చాలా మంది సినిమా ఇండస్ట్రీ వర్గాల వారు ఆ విషయం గురించి స్పందించిన విషయం తెల్సిందే.

ఇటీవల పూరి ఆకాష్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలతో అసలు రచ్చ మొదలు అయ్యింది.దర్శకుడు పూరి గత కొన్నాళ్లు గా ముంబయి లోనే ఉంటున్నాడు.

కుటుంబం.ఫ్యామిలీ అంటే పెద్దగా పట్టని పూరి ఇటీవల తన కొడుకు సినిమా ప్రమోషన్ కు అస్సలు ఆసక్తి చూపించలేదు.

ఆయన రాలేదు అంటూ చాలా మంది ఆ సమయంలో చర్చించుకున్న విషయం తెల్సిందే.ఇప్పుడు ఆయన హైదరాబాద్‌ లో అడుగు పెట్టాడు.

Advertisement

చాలా నెలల తర్వాత హైదరాబాద్ కు వచ్చిన పూరి జగన్నాద్‌ గురించిన చర్చ సినిమా ఇండస్ట్రీ లో జరుగుతోంది.ముంబయి నుండి నేరుగా ఒక హోటల్ కు వెళ్లిన పూరి అండ్‌ లైగర్ టీమ్‌ అక్కడ నుండి ప్రెస్ మీట్‌ కు హాజరు అయ్యారు.

ఆ వెంటనే మళ్లీ ముంబయి కి వెళ్తారనే వార్తలు వస్తున్నాయి.

హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ అనన్య పాండే తో కలిసి పూరి హైదరాబాద్‌ లో ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.ఆ సందర్బంగా పూరి పై ట్రోల్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.ఆ హీరోయిన్ కూడా సదరు ప్రెస్ మీట్‌ లో ఉండటం వల్ల మరింతగా చర్చ జరుగుతోంది.

మొత్తానికి డాషింగ్ డైరెక్టర్‌ హైదరాబాద్‌ కు రావడం కూడా పెద్ద చర్చ కు తెర తీసింది.ముందు ముందు పూరి గురించి ఎలాంటి వార్తలు.వాదనలు వినాల్సి వస్తుందో అనే చర్చ ఆయన అభిమానుల్లో జరుగుతోంది.

పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!
Advertisement

తాజా వార్తలు