బాలకృష్ణ కూడా చిరంజీవి మాదిరిగా ఆ ఒక్క మాట అంటే బాగుండేది

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక్క రోజులో రెండు సినిమాలను విడుదల చేయబోతుండడం అతి పెద్ద ఘనతగా పేర్కొన్నారు.

వారు నిర్మించిన వీర సింహా రెడ్డి సినిమా కూడా ఇదే సందర్భంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ చిరంజీవి వీర సింహా రెడ్డి సినిమా కూడా బాగా ఆడాలని ఆశిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తన పోటీ సినిమా అయిన వీర సింహా రెడ్డి సక్సెస్ అవ్వాలని కోరుకోవడం కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యమైందని మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా మెగాస్టార్ చిరంజీవి మాత్రమే చేయగలరని ఆయనకు మాత్రమే సాధ్యమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో గొప్పగా మాట్లాడుకుంటున్నారు.ఇక వీర సింహా రెడ్డి సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ సమయం లో చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య కూడా సక్సెస్ అయిపోవాలని బాలకృష్ణ ఒక్క మాట మాట్లాడి ఉంటే ఆయన స్థాయి కూడా ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తన సినిమానే సక్సెస్ అన్నట్లుగా బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడం తో ఆయన పై విమర్శలు వచ్చాయి.

Advertisement

చిరంజీవి ఒక్క మాట వీర సింహా రెడ్డి సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ చేసి గొప్పవాడయ్యాడు అంటూ సోషల్ మీడియా లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడే కాదు గతం లో కూడా తన ప్రత్యర్థి హీరో ల సినిమా లు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ వ్యాఖ్యలు చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు.మనసులో ఏమున్నా కూడా బయటకు అలాంటి వ్యాఖ్యలు చేస్తే అభిమానులతో పాటు అంతా కూడా సంతృప్తి చెందుతారు కదా అని బాలయ్య కు కొందరు కౌంటర్ ఇస్తున్నారు.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు