ఇంకా ఎంత ట్రోల్ చేస్తారో చేసుకోండి ... ప్రభాస్ హిట్స్ తోనే సమాధానం చెబుతాడు

ప్రభాస్( Prabhas ) కల్కి సినిమా( Kalki Movie ) విజయం చాలామందికి ఒక చెంపపెట్టు లాంటిది.

ఆయన అభిమానులు ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని ఎంతో ఆరాటపడ్డారు.

అలాగే అందరి ఆకాంక్షకు సరిపోయే విధంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకునే దిశగా వెళుతుంది.అయితే చాలా ఏళ్లుగా ప్రభాస్ పై ఎన్నో రకాల ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి.

ఇక సోషల్ మీడియా లో ఆయనపై వచ్చే గాసిప్స్ కి అయితే అంతే లేదు.కెరియర్ పరంగా, వ్యక్తిగతంగా ఆయన విమర్శించేవారు ఖచ్చితంగా ఉన్నారు.

ఎవ్వరు ఏమన్నా ఎంత మాట్లాడినా ప్రభాస్ మాత్రం తను ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడడు.తన వ్యక్తిత్వంతోనే అందరికీ ప్రేమను పంచుతాడు ప్రతి ఒక్కరి ప్రేమను సంపాదించుకుంటాడు.

Advertisement

చాలామంది ఈ తన లుక్స్ పై కూడా కామెంట్స్ చేసేవారు బాహుబలి తర్వాత ఆయన శరీరంలో చాలా మార్పులు వచ్చాయి.బాహుబలి( Bahubali ) సమయంలో తీసుకున్న స్టెరాయిడ్స్ కారణంగానే ఇప్పుడు మొహంలో అనేకం మార్పులు వచ్చి వయసుకు మించి కనపడుతున్నాడు అనే అపవాదును మూటగట్టుకున్నాడు.ఇందులో నిజం ఏంటో ఎవరికి తెలియదు.

కానీ దీనిపై చాలా రోజులుగా ప్రభాస్ పై వార్తలు వస్తున్నాయి.మరోవైపు అతడు సినిమాలు విజయవంతం కావని పేరు తెలియని జ్యోతిష్యులు సైతం ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు.

దానికి సలార్( Salaar ) సినిమాతోనే సమాధానం చెప్పాడు.ఒక సినిమా విజయం సాధిస్తే మూడు సినిమాలు పరాజయం అవుతాయి అనే మాట కూడా ప్రభాస్ విషయంలో వినిపిస్తూ ఉంటుంది.

బాలీవుడ్ లో ప్రభాస్ ను ఎదగకుండా చేయాలనే చెత్త సినిమాలు చేయిస్తున్నారని అపవాది కూడా ఉంది అందుకు ఆది పురుష్( Adipurush ) ఒక ఉదాహరణ.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇక పెళ్లి చేసుకోవడానికి ఈ వయసు దాటిపోతుంది అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన గురించి గోల వినిపిస్తుంది.అయినా ఈ మాటలను ప్రభాస్ ఏ రోజు పట్టించుకోడు తన పని తాను చేసుకుంటూ వెళతాడు తన సినిమా తప్ప తనకు ఇంకో ప్రపంచం తెలీదు అలా హిట్స్ తోనే జనాలు నోరులు మోయిస్తూ ఉంటాడు.కల్కి సినిమా ఇప్పుడు మరోసారి అందరి నోళ్లకు తాళాలు పడేలా చేసింది.

Advertisement

ఇక ఆయన చేయబోయే అన్ని సినిమాలు విజయం సాధించాలని ఆశిస్తూ ఇకపై ఆయనపై ట్రోల్స్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తాజా వార్తలు