సోషల్‌ మీడియా దశాబ్దమిది.. ఏవి హిట్‌? ఏవి ఫట్‌?

మరికొద్ది రోజుల్లోనే 21వ శతాబ్దంలోని రెండో దశాబ్దాన్ని ముగించుకొని మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టబోతున్నాం.2010తో మొదలైన ఈ దశాబ్దం కచ్చితంగా సోషల్‌ మీడియాకే చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రధాన మీడియాను కూడా వెనక్కి నెట్టి.

ఈ పదేళ్లనూ సోషల్‌ మీడియానే రాజ్యమేలింది.ప్రధాన మీడియా మరుగున పడేసిన వాస్తవాలను, ఆ మీడియాకు అసలు పట్టని వార్తలను కూడా సోషల్‌ మీడియా బయటపెడుతోంది.

సోషల్‌ మీడియాలో కొన్ని కేవలం వినోదం కోసం మాత్రమే ఉండగా.మరికొన్ని ఆలోచనలను పంచుకునే వేదికలుగా మారాయి.

ముఖ్యంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, స్నాప్‌చాట్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, టిక్‌టాక్‌లాంటివి ప్రజల జీవన శైలిలో పెను మార్పులు తీసుకొచ్చాయి.

Advertisement

వంద కోట్లకుపైగా నెలవారీ యాక్టివ్‌ యూజర్లతో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లాంటివి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాయి.ఇక వాట్సాప్‌కు పోటీగా ఇండియాలో పురుడు పోసుకున్న టెలిగ్రామ్‌ కూడా ఆరేళ్లలోనే తన సత్తా చాటింది.ఈ చాటింగ్‌ యాప్‌కు ప్రస్తుతం 20 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు.

అటు టిక్‌టాక్‌, టిండర్‌లాంటి యాప్స్‌ ఎన్ని సంచలనాలు సృష్టించాయో కూడా మనం చూశాం.టిక్‌టాక్‌ ఎంతో మందిని సెలబ్రిటీలుగా కూడా మార్చింది.

అయితే అదే స్థాయిలో వివాదాలూ చుట్టుముట్టడంతో నిషేధానికీ గురైంది.ఇక డేటింగ్‌ యాప్‌ టిండర్‌కు యూత్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది.

స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ సోషల్‌ మీడియా యాప్స్‌ను ప్రతి రోజూ కోట్లాది మంది వాడుతున్నారు.అదే సమయంలో మరికొన్ని పోటీని తట్టుకోలేక తమ ఉనికిని కోల్పోయాయి.

How Modern Technology Shapes The IGaming Experience
న్యూస్ రౌండప్ టాప్ 20

గూగుల్‌లాంటి సంస్థ కూడా తగిన ఆదరణ లేక తన గూగుల్‌ ప్లస్‌ను మూసేయాల్సి వచ్చింది.అలాగే ఆర్కూట్‌, యాహూ మెసెంజర్‌, యిక్‌యాక్‌, వైన్‌, బ్లాక్‌బెర్రీ మెసెంజర్‌లాంటివి కూడా కనుమరుగయ్యాయి.

Advertisement

తాజా వార్తలు