ఆ విషయంలోనే నాగచైతన్య ప్రేమలో పడిపోయా.. శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!

మరొక రెండు రోజులలో నాగచైతన్య( Naga Chaitanya ) శోభిత( Sobhita ) పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నాగచైతన్య శోభితతో పరిచయం ఎక్కడ ఏర్పడిందనే విషయాల గురించి అలాగే శోభిత కుటుంబం గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు.అయితే శోభిత కూడా నాగచైతన్యత ప్రేమలో పడటం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Sobhita Interesting Comments On Naga Chaitanya Love Details, Naga Chaitanya, Sob

శోభిత నాగచైతన్యతో ప్రేమలో ఎలా పడ్డారు ఏంటి అనే విషయాల గురించి ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.నాగచైతన్యతో మొదటిసారి ఓటీటీ షోలో పరిచయం ఏర్పడిందని తెలిపారు.అయితే ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత నాగచైతన్య వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చింది ఆయన చాలా కూల్ గా కామ్ గా ఉంటారు.

ఏ విషయానికి ఆవేశపడరు ఎంతో మంచి మనస్తత్వం.చాలా సింపుల్ గా ఉంటారు.ఎలాంటి ఆడంబరాలకు వెళ్లరు.

Advertisement
Sobhita Interesting Comments On Naga Chaitanya Love Details, Naga Chaitanya, Sob

ఈ విషయాలు నాకు ఎంతగానో నచ్చడమే కాకుండా ఆయనతో ప్రేమలో( Love ) పడేలా చేశాయి అంటూ శోభిత తెలిపారు.

Sobhita Interesting Comments On Naga Chaitanya Love Details, Naga Chaitanya, Sob

ఇలా నాగచైతన్యలో ఉన్న ఈక్వాలిటీస్ తనతో ప్రేమలో పడటానికి కారణమయ్యాయని శోభిత నాగచైతన్య గురించి తనతో ప్రేమలో పడటం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి.ఇటీవల వీళ్లిద్దరికి హల్దీ వేడుకను నిర్వహించారు.

ఇలా ఒకే చోటే హాల్ది వేడుకతో పాటు ఎంతో సాంప్రదాయబద్ధంగా మంగళ స్నానాలను కూడా చేయించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు చైతన్య శోభిత వివాహం జరగబోతోంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు