పవన్ కనుక ఆ పని చేస్తే ప్రజల్లో తిరుగు ఉండదేమో

జనసేనాని పవన్ కల్యాణ్ పాలిటిక్స్ ప్లస్ సినిమాలు రెండూ చేస్తున్నారు.జోడు గోర్రాల మీద స్వారీ చేస్తున్నాడని చెప్పొచ్చు.

అయితే, పవన్ ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.క్రిష్ డైరెక్షన్‌లో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన పవన్ కల్యాణ్, ఇప్పుడు మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర డైరెక్టర్ కాగా, మాటలు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు.ఈ సంగతులు పక్కనబెడితే.

పవన్ సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో గ్యాప్ దొరికినపుడు పాలిటిక్స్‌పైన దృష్టి సారిస్తున్న సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలో పవన్ ఏపీలో ఫుల్ కాన్సంట్రేషన్ ఇప్పుడే చేస్తే బాగుంటుందేమో అనే అభిప్రాయ పవన్ ఫ్యాన్స్, జనసైనికుల నుంచి వినిపిస్తున్నది.

Advertisement
So If Pawan Does That, There Will Be A Backlash Among The People, Pavan, Politic

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీపైన వ్యతిరేకత ప్రారంభమైంది.ఆ పార్టీలోనే అంతర్గత విభేదాలు షురూ అయ్యాయి.

So If Pawan Does That, There Will Be A Backlash Among The People, Pavan, Politic

ఈ నేపథ్యంలో పవన్ రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తే పార్టీకి లాభం జరుగుతుందని అనుకుంటున్నారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం జరుగుతున్నప్పటికీ అది తీవ్రరూపం దాల్చలేదు.ఈ ఉద్యమాన్ని పవన్ నేతృత్వంలో నడిపిస్తే దేశరాజధాని ఢిల్లీలో ప్రకంపనలు వచ్చే అవకాశాలుంటాయని పేర్కొంటున్నారు పవన్ అభిమానులు.

ఇక ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ప్రస్తావించడం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీకి రాజకీయ ప్రయోజనాలుంటాయని అంచనా వేస్తున్నారు.ఇదే క్రమంలో పోలవరం ప్రాజెక్టు నిధుల విషయమై కేంద్రం వద్ద ప్రస్తావించడం, నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్‌పైన మాట్లాడటం వంటివి పవన్ చేస్తే పవన్‌ వెంట యూత్ ఆటోమేటిక్‌గా ర్యాలీ అవుతరాని, ఫలితంగా జనసేన పార్టీ రాజకీయంగా ఎదుగుతుందని అనుకుంటున్నారు.

ఈ విషయాలపై పవన్ ఆలోచన ఎలా ఉందో మరి.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు