అమెరికాని బెంబేలెత్తిస్తున్న ఆ చేప

అగ్ర రాజ్యం అమెరికా ఒక్క చేప విషయంలో ఇంతగా భయపడటం ఏమిటి అనుకుంటున్నారా.అందులో ఓ రీజన్ ఉంది.

ఈ చేప అమెరికా జీవావరణ వ్యవస్థకే పెద్ద ముప్పు తీసుకురానుందట.దాంతో వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమమలోనే సదరు చేప ఎక్కడ కనపడిన చంపేయండి అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు.ఇంతకీ ఆ చేప కధ ,కమీషు వివరాలలోకి వెళ్తే.

తూర్పు ఆసియాకి చెందిన అచ్చం పాము తలని పోలిన ఓ చేపని ఇటీవల జార్జియా లోని ఓ చెరువులో కనపడింది.అనుమతి లేకుండా వీటిని దిగుమతి చేసుకోవడం, అమ్మడంపై కూడా నిషేధం ఉంది.

Advertisement

అటువంటిది ఈ చేప అమెరికాలో కన్పించడం పై ఆందోళన చెందుతున్నారు.

  మూడు అడుగులకి పైగానే పెరిగే ఈ చేప నేలపై సైతం కొంత దూరం కదలగలదని, ఈ చేప ఉన్న చెరువులు, ప్రాంతంలో జలచారాలని తినేస్తుందని అంటున్నారు అమెరికా మత్య శాఖా అధికారులు.దాంతో ఈ చేపటి పట్టి చంపి ఫోటో తీసి పంపిన వారికి పారితోషకం ఉందంటూ ప్రకటనలు చేయడం గమనార్హం.

Advertisement