నాగు పాముకు ఫేస్ మాస్క్.. అదిరిపోయే ఐడియా!

కరోనా వైరస్.

మనుషులను చంపేస్తుంది, అనారోగ్యవంతులను చేస్తుంది బయటకు వెళ్లే సమయంలో ఫేస్ మాస్కు ధరించండి, శానిటైజర్ ఉపయోగించండి అని అందరూ పదే పదే చెప్పిన ఎంతోమంది పట్టించుకోవడం లేదు.

కరోనా వైరస్ వచ్చిన పోతుందిలే, పెద్ద వైరస్ ఏం కాదు అన్నట్టు ఈ కాలం ప్రజలు వ్యవహరిస్తున్నారు.అయితే కరోనా వైరస్ కు కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా బలవుతున్నాయి.

Jagityala Man Snake Needs A Face Mask Viral Jagityala Man, Snake Wears A Face M

జంతువులకు కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని జగిత్యాలలో పాములు పెంచే ఓ వ్యక్తి ప్రజలకు మాస్కులు ధరించండి ధరించండి అని చెప్పి అలసిపోయాడు.

దీంతో తన పాముకే మాస్కు వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచించాడు.అంతే వెంటనే తన పాముకు ఫేస్ మాస్కు వేసేశాడు.

Advertisement

ఇంకేముంది ఆ పాములు ఆటాకు కూడా మంచి గిరాకీ పెరిగిందట.అది చూసిన కొందరు దాని ఫోటోలు షేర్ చేస్తూ ఆ పామును చూసి అయినా ఫేస్ మాస్క్ ధరించండి అంటూ క్యాప్షన్ పెట్టారు.

దీంతో ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఈ విచిత్ర సంఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం, పైడిమడుగులో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు