35 వేల పాముల్ని పట్టుకున్నాడు, కానీ పాము కాటుతో!

కర్ణాటక నెలమంగళలోని మారుతీ నగర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.

వేలాది పాములు పట్టుకుని సురక్షితంగా వాటిని అడవిలో వదిలి పెట్టిన ఓ వ్యక్తి చివరికి అదే పాము కాటుతో ప్రాణాలు కోల్పోయాడు.

మారూతీనగర్ కు చెందిన లోకేశ్. చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఆయన ఇప్పటి వరకు 35 వేలకుపైగా పాములను పట్టుకున్నాడు.

చుట్టు పక్కల ఎవరు ఫోన్ చేసినా అక్కడికి వెళ్లి ఆ పాములను పట్టుకుని సురక్షితంగా వదిలి వేసేవాడు.దాంతో అతని పేరు కాస్త స్నేక్ లోకేశ్ గా మారింది.

స్నేక్ లోకేశ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆగస్టు 17న డాబస్ పట్టణం నుండి లోకేశ్ కు ఫోన్ వచ్చింది.

Advertisement

వెంటనే అక్కడికి వెళ్లిన స్నేక్ లోకేశ్.అక్కడ ఉన్న పామును పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.

ఎప్పట్లాగే నైపుణ్యంగా పామును పట్టుకునే క్రమంలో ఆ పాము అతని చేతిపై కాటు వేసింది.వెంటనే అతడిని నెలమంగళ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.

అప్పటి నుండి చికిత్స పొందుతున్న స్నేక్ లోకేశ్.మంగళవారం తుది శ్వాస విడిచాడు.

వేలాది పాములు పట్టి సురక్షితంగా వదిలి పెట్టిన లోకేశ్.చివరికి అదే పాము కాటుకు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.35 వేల పాములు పట్టిన వ్యక్తి ఇలా పాము కాటుకు గురి కావడం, చికిత్స పొందుతూ మృతి చెందడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలు అన్ని ఉన్నాయా..
Advertisement

తాజా వార్తలు