ప్రత్యేక పద్ధతిలో కీరా సాగుతో ఊహించ‌ని లాభాలు

రైతులు సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తే వారి ఆదాయం పెరుగుతుంది.

ఇటావా జిల్లాలోని చౌబియాలో నివాసముంటున్న బ్రిజేష్ యాదవ్ అనే రైతు ఈ విషయాన్ని నిరూపించాడు.

మెకానికల్ విభాగంలో బీటెక్‌ చేసి, ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేశాడు.ఉద్యోగం చేయ‌డం క‌న్నా ఆధునిక‌ వ్యవసాయం ఉత్త‌మ‌మ‌ని భావించాడు ఉద్యోగం మానేసి పాలీహౌస్ రెడీ చేసుకుని నేడు దానిలో కీరా పండిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

ఈ విజయానికి హార్టికల్చర్ డెవలప్‌మెంట్ మిషన్ కూడా ఎంతగానో దోహదపడింది.ఈ సంస్థ‌ ద్వారా పాలీహౌస్ నిర్మాణానికి సహాయం అందుకున్నాడు.బ్రిజేష్ యాదవ్ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం మానేసి స్మార్ట్ వ్యవసాయంపై దృష్టి సారించాడు.2016లో పాలీహౌస్ నిర్మించాలని అనుకున్నాడు.అనంతరం ప్రభుత్వం పథకాలకు సంబంధించిన సమాచారాన్ని సేక‌రించి సంబంధిత శాఖలను క‌లుసుకున్నాడు.4000 చదరపు మీటర్లలో పాలీహౌస్‌ను సిద్ధం చేసుకున్నాడు.40 లక్షలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశాడు.ప్రభుత్వం నుంచి రూ.19.67 లక్షల సబ్సిడీ వచ్చింది.ఇందులో మొత్తం వ్యవసాయానికి నీరందించే పాలీహౌస్‌లో 3 కిలోవాట్ల సోలార్ పంపును కూడా ఏర్పాటు చేశారు.

నీటి నిల్వ ట్యాంకులను కూడా సిద్ధం చేశాడు.ఇదంతా సిద్ధమైన తర్వాత తన పాలీహౌస్‌లో కీరా సాగుకు ప్రాధాన్యత ఇచ్చాడు.

Advertisement

కీరా మార్కెట్‌ బాగానే ఉందని యాదవ్ తెలిపారు.మంచి ధర రావ‌డంతో గతేడాది సుమారు రూ.6 లక్షల ఆదాయాన్ని అందుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు