నిద్రలేమి ఎన్నో అనర్థాలకు కారణం అవుతుంది.చాలా పెద్దగా ఉండే ప్రమాదాల లిస్టులోకి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ (CKD) కూడా వచ్చి చేరింది.
చికాగో లోని యునివర్సిటి ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు చేసిన స్టడీలో ఈ విషయాన్ని వెల్లడించారు.432 యువతి యువకలపై కొంతకాలం పరిశోధన జరిపిన ప్రొఫెసర్స్, CKD తో ఇబ్బందిపడుతున్న వారి చేతికి ఓ ఎలక్ట్రానిక్ బ్యాండ్ తగిలించారు.ఆ బ్యాండ్ ద్వారా రోజుకి ఎవరు ఎంతసేపు నిద్రపోతున్నారో ట్రాక్ చేసేవారు.
అందులో తక్కువగా నిద్రపోయినవారు, అంటే 7 గంటలకి తక్కువ నిద్రతో రోజులు గడిపినవారిలో 70 మందిలో కిడ్నీకి సంబంధిచిన సమస్యలు పెరిగిపోగా, మరో 48 మంది ఏకంగా మృత్యువాత పడ్డారట.నిద్ర ఓ గంట పెరిగినా కొద్ది, CKD వచ్చే అవకాశం 19% తగ్గిపోతుందని ప్రొఫెసర్ అనా రికార్డో తెలిపారు.
ఆ ప్రొఫెసర్ ఇంకా మాట్లాడుతూ " మన నిద్రకి కిడ్నీ పనితనానికి చాలా సంబంధం ఉంటుంది.మా రిసేర్చిలో ఇదే విషయం బయటపడింది.ఆయుష్షు క్షీణించే అతిపెద్ద కారణాలలో నిద్రలేమీ ప్రధానమైనది.
క్రోనిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి ఇదో పెద్ద కారణం.కాబట్టి ఆరోగ్యకరమైన నిద్ర శరీరానికి ఇవ్వాలి.
" అంటూ చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy