ప్రణయ్ భార్య అమృత బయటపెట్టిన సంచలన విషయాలివే.! నెల క్రితమే అలా జరిగింది అంట.?

ఆంటీ! చంపేసారాంటీ.నా ప్రణయ్ ను చంపేసారు.

మేం ఎన్ని కలలు కన్నామో.

వాటినన్నింటిని తుంచేసారాంటీ.

నన్ను పెండ్లి చేసుకోక పోయినా ప్రణయ్ బతికేవాడాoటీ.నన్ను చంపుకొనే హక్కు వాళ్ళకుండవచ్చు.

కానీ వేరే తల్లిదండ్రులు కన్న బిడ్డను చంపే హక్కు వాళ్లకెలా వచ్చింది? ప్రణయ్ తో నాస్నేహం ఇప్పటిది కాదాంటీ.తను లేకుండా నేను జీవించట మేంటి? నా భర్తను,నా అత్తమామలను ఎన్నోసార్లు రాజకీయ నాయకులతోనే కాదు, ప్రత్యేక్షంగానూ వాళ్ళు

బెదిరించారు.అయినా

నన్ను బలవంతంగా తీసుకొని వెళ్లలేకపోయారు.నా తండ్రికి నా బాబాయికి కూడా పడదు.

Advertisement

అయినా మా నాన్నకున్న కోట్ల ఆస్తిని కాజేసే విధంగా, నాజీవితాన్ని సమాధి చేసే స్కెచ్ వేసి కులాన్ని ముందుకు తెచ్చి నా భర్తను పొట్టన పెట్టుకున్నారు.వాళ్లిద్దరూ అక్రమంగా,దొర్జన్యంగా, మోసాలు చేసి సంపాదించిన ఆస్తులు నాకెందుకు? మొదటినుంచి వాళ్ళు కులపిచ్చితో,డబ్బు మదంతో గొప్పవాళ్లుగా చెలామణి అవుతున్నారు.కులం కోసం నా జీవితాన్ని ఇప్పుడు నాశనం చేశారు.

అసలు మన దేశంలో కులమనేదే లేకుండా పోవాలని, పేద

వాళ్లకు మాత్రమే రిజర్వేషన్లు, అవకాశాలు వచ్చే విధంగా మనం పోరాడుదామని ప్రణయ్ నాతో చెప్పేవాడు.ఇప్పుడేమైంది ఏ కులమైతే వద్దనుకున్నామో అదే కులం ప్రణయ్ ను చంపేసింది.ప్రణయ్ ను నాకు కాకుండా చేసింది.

పుట్టబోయే బిడ్డకోసం ఇద్దరం అనేక కలలను దాచుకొని.బిడ్డపుట్టాక తనను తీసుకొని విదేశాలకు వెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేసుకున్నాం.

అవన్నీ ఇప్పుడు ఎలా మారిపోయాయో చూడండి?.నా ప్రణయ్ ప్రతిరూపం నాలో ఇప్పుడు లేకుంటే.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

నేనూ నా భర్తతో పాటే.చచ్చి పోయేదాన్ని.

Advertisement

కానీ ఇప్పుడు ఆ పని చేయను.నా ప్రణయ్ ప్రతిరూపం కోసం నేను బ్రతుకుతాను.

నా అత్తారింటిలొనే జీవిస్తాను.నాబిడ్డకు వాళ్ళ చేతుల మీదనే పెంచుతాను.

నా భవిష్యత్తు వాళ్ళతోనే నిర్మించుకొని నా భర్త ఆశయం నెరవేరుస్తాను.నా భర్తను చంపిన నాతండ్రి,

బాబాయిలను చంపాలి.

రాజకీయ నాయకుల అండతో, ధన బలంతో,కుల దూరహంకారంతో ప్రణయ్ ను చంపటానికి సుపారీలు ఇచ్చి, వారికి ఇన్నోవాలు కొనిపెట్టి దారుణంగా నా కళ్ళముందే హత్య చేసారు.నా భర్తను నా కళ్ళ ముందే నరికేసాడు.

రక్తం మడుగులో నా భర్తను చూసి తట్టుకోలేక పోయాను. నా భర్తను చంపటంలో సహకరించిన వాళ్ళందరిని వదిలిపెట్టవద్దు.వాళ్ళందరికీ శిక్ష పడినప్పుడే నా ప్రణయ్ కు న్యాయం జరుగుతుంది.ఇంత జరిగినా తమ బిడ్డను కోల్పోయినా నా అత్తామామలు నన్ను ప్రణయ్ లా చూసుకుంటామని, నా బిడ్డను పెంచి పోషిస్తామని అంటున్నారు.

నన్ను నా బిడ్డను ఆదరిస్తామని అంటున్న నా అత్తామామలు గొప్పవాళ్ళా? కులం కోసం ధన మదంతో నా ప్రణయ్ ను చంపిన నా తండ్రి, బాబాయిలా? ఎవరిది గొప్పకులం? ఎవరు గొప్ప వాళ్ళు?ఎవరు ఈ సమాజానికి కావాల్సిన వారు?( పొరలి వచ్చే దుఃఖంలో అమృత వేసే ప్రతి ప్రశ్నలో పరిణితి చెందిన ఆమె వ్యక్తిత్వం దాగి ఉంది.ఆమెకు జీవితం యెడల ఉన్న ఒక క్లారిటీని తెలియచేస్తుంది).

తాజా వార్తలు