ఒక్కోసారి మనం ఎదుటివారి కష్టంలో ఉన్నప్పుడు డబ్బు సహాయం( Money Help ) చేయకపోవచ్చు.కానీ వారిని కొన్ని నిమిషాల పాటు ఆనందం తెప్పించే విధంగా కొన్ని రకాల పనులు చేసి కూడా వారిని మెప్పించవచ్చు.
అలాగే ఆనందం కలిగించవచ్చు.ఎదుటివారి కోసం మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల వారికి ఎంతోకొంత సంతోషాన్ని కలిగిస్తాయని తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి చెప్పకనే చెబుతోంది.
హోటల్ కు కస్టమర్ వచ్చిన తర్వాత అక్కడ ఉండే వెయిటర్ కు కస్టమర్ ఇచ్చిన బహుమతిని చూసి ఆనంద పడిన మధుర క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆకాష్ సెలవరుసు( Akash Selvarasu ) అనే ఓ స్కెచ్ ఆర్టిస్ట్ తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.అతడు రెస్టారెంట్ వెళ్లిన సమయంలో రెస్టారెంట్( Restaurant ) లో కష్టపడి పనిచేస్తున్న వైటర్( Waiter ) ను చూసి అతన్ని పూర్తిగా గ్రహించి ఆపై అతని స్కెచ్ ను ఆ హోటల్లో బిల్ చేసిన దానిపై వేసి ఇచ్చాడు.ఈ సందర్భంలో వెయిటర్ ను అదే పనిగా పరిశీలిస్తూ స్కెచ్ ను పూర్తి చేశాడు.
స్కెచ్ పూర్తి అయిన తర్వాత ఆకస్మాత్తుగా ఆకాష్ వెళ్లి వెయిటర్ కు బిల్లును చేతిలో పెట్టాడు.అయితే మొదట్లో ఆకాష్ ఏం చేస్తున్నాడో ఆ వెయిటర్ కు ఏమీ అర్థం కాలేదు.
అయితే ఎందుకైన మంచిదని ఓసారి తన చేతిలో పెట్టిన బిల్లును చూశాడు.
దాంతో క్షణాల వ్యవధిలో ఆ వెయిటర్ మోఖంలో ఎక్కడ లేని సంతోషం వెళ్లి విరిసింది.ఇక ఈ ఆనందంలో తన ఫోటోను తన తోటి వారికి కూడా చూపించి సంతోషపడ్డాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ ఆర్ట్( Waiter Sketch ) ను గీసిన ఆకాశ్ ను నెటిజెన్స్( Netizens ) ప్రశంసిస్తున్నారు.అతడు చేసిన ఆ చిన్న పనికి వెయిటర్ ఆ రోజంతా సంతోషంగా ఉంటాడని తనకు ఎంత కష్టమైనా సరే అది పక్కనపడేసి హ్యాపీగా తన పని తను చేసుకుంటాడని అంటుండగా.
మరికొందరు అవతలి వారి మనసు తేలికపరిచేందుకు ఇలాంటి చర్యలు అసలు విలువ కట్టలేవని అంటున్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy