Pawan Kalyan Sj Surya : పవన్ సీఎం అవుతారు... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎస్ జె సూర్య?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు.

ఈయన ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ అధికార పార్టీ ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలను ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొనడంతో ఈయన సీఎం అయితే చూడాలని ఎంతో మంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ కొందరు అభిమానులు కోరుకోగా మరికొందరు ఈయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు తీర్చే సమర్థవంతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ తరచూ రాజకీయాలకు సంబంధించిన ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.

ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి దర్శకుడు నటుడు ఎస్ జె సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఎస్ జె సూర్య మాట్లాడుతూ తనకు పవన్ కళ్యాణ్ తో మంచి బాండింగ్ ఉందని, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ తో తన జర్నీ కొనసాగుతుందని తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన మనసు ఏపీ ప్రజలకు తెలుసు తప్పనిసరిగా ఈయన ఏదో ఒక రోజు సీఎం అవుతారు అప్పుడు తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతానంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఎస్ జె సూర్య చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.దీంతో ఈ వ్యాఖ్యలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమం ఏ సమయంలో చేయాలో తెలుసా..!
Advertisement