Digestion health tips : కింద కూర్చొని తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..!

ఈ బిజీ లైఫ్ లో చాలామంది భోజనం నిలబడి తినడం లేదా ఎక్కడో ఒక కుర్చీ మీద కూర్చొని తినడం చేస్తూ ఉంటారు.

ఇక ధనవంతులు అయితే భోజనం టేబుల్ మీద కూర్చొని తింటారు.

అయితే భోజనం ఇలా కుర్చీల మీద టేబుల్ మీద కూర్చొని తినే కన్నా కింద కూర్చుని తినడం వల్ల చాలా మంచిది.ఇలా కింద కూర్చుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.అయితే కింద కూర్చుని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కింద కూర్చుని తినడం వల్ల మెదడు రిలాక్స్ గా ఉంటుంది.అలాగే నేలపైన కూర్చుని తింటే ఫోకస్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అలాగే కింద కూర్చొని భోజనం చేయడం వల్ల మనసు ఎంతో ఫ్రీగా ఉంటుంది.అలాగే మనిషికి ఉన్న ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.

అంతేకాకుండా ఆక్సిజన్ సర్కులేషన్ కూడా బాగా పెరుగుతుంది.

కానీ మనం కిందకి వంగి భోజనం చేస్తే ఏకాగ్రత పూర్తిగా పెట్టవచ్చు.అందుకే మనకి సరిపడా భోజనం మనం తింటాము.దీంతో బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.

కింద కూర్చొని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది.ఎందుకంటే వాళ్ళ జీర్ణం బాగా జరుగుతుంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

నేల మీద కూర్చుని తినేటప్పుడు మనం వంగి ఉన్న పొజిషన్లో ఉంటాము.దీని మూలంగా జీర్ణ రసాలు బాగా రిలీజ్ అవుతాయి.

Advertisement

దీంతో జీర్ణం బాగా అవుతుంది.అలాగే కింద కూర్చొని తినడం వల్ల బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా జరుగుతుంది.

ఎందుకంటే కింద కూర్చొని తినడం వల్ల పాదాలకి రక్తప్రసరణ తగ్గుతుంది.దీంతో రక్తం గుండె ద్వారా ఇతర భాగాలకు బాగా వెళుతూ ఉంటుంది.

దీంతో రక్తప్రసరణ బాగా ఇంప్రూవ్ అవుతుంది.అందుకే టేబుల్ ల మీద కూర్చోని తినే కన్నా ఇలా కింద కూర్చొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

తాజా వార్తలు